For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షీనా బోరా హత్య కేసుపై సినిమా..‘డార్క్ చాకొలెట్’(ఫస్ట్ లుక్)

  By Bojja Kumar
  |

  హైదరబాద్: బాలీవుడ్లో తెరకెక్కుతోన్న ‘డార్క్ చాకొలెట్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. దేశంలో సంచలన క్రియేట్ చేసిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా లైఫ్ స్టైల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అగ్నిదేవ్ చటర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా బెంగాలీ ఫిల్మ్ స్టార్స్ మహిహా చౌదరి, రియా సేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  చాలా కాలం పాటు నటనకు దూరంగా ఉన్న మహిమా చౌదరి ఈ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో మహిమా చౌదరి ఇషాని బెనర్జీ గా (ఇంద్రాణి ముఖర్జియా ఆధారంగా డిజైన్ చేసిన పాత్ర)లో నటిస్తోంది. రియా సేన్ ఈ చిత్రంలో రినా బర్దన్ (షీనా బోరా పాత్ర)గా కనిపించబోతోంది. ఈ చిత్రంలో ఇంకా సందీప్ ముఖర్జి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన రియల్ లైఫ్ పీటర్ ముఖర్జియా పాత్రలో కనిపిస్తారని టాక్. ఫిబ్రవరి 19న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  Dark Chocolate First Look Poster

  షీనా బోరా హత్య కేసు...
  ఎంతటి నేరమైనా చివరికి వెలుగులోకి రాక తప్పదు. దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు కూడా అలాగే బట్టబయలైంది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత మద్యం మత్తు తలకెక్కిన ఒక సాయంత్రం వేళ షీనా బోరా హత్య గుట్టు వీడింది. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకడు, ఇంద్రాణి ముఖర్జియా మాజీ డ్రైవర్ శ్యామ్-వర్ రాయ్ మర్డర్ మిస్టరీని ఎలా బయట పెట్టిందీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

  ముంబైలో (2012) కదులుతున్న కారులో షీనాను హత్య చేసిన అనంతరం ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి మృతదేహాన్ని రాయ్-గఢ్ అడవుల్లో పాతిపెట్టారు. ఆ తరువాత సంజీవ్ కోల్ కతాకు, ఇంద్రాణి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయారు. ఇంద్రాణి ఇచ్చిన 5 లక్షల రూపాయలతో శ్యామ్ రాయ్ సొంత ఊరికి వెళ్లిపోయి కొత్త వ్యాపారం మొదలు పెట్టాడు. ఊర్లో వ్యాపారాన్ని నమ్మకస్తుడైన స్నేహితుడికి అప్పజెప్పి మళ్లీ ముంబై వచ్చి ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు. సహచర డ్రైవర్లకు అప్పుడప్పుడూ మందు పార్టీలు కూడా ఇచ్చేవాడు. అలా ఓ రోజు మద్యం మత్తులో మూడేళ్లుగా తన మనసులోనే దాచుకున్న మర్డర్ మిస్టరీని తోటి ఆటోడ్రైవర్ కు చెప్పేశాడు. విన్నవాడు మామూలోడు కాదు. పోలీస్ ఇన్ఫార్మర్ కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఇంద్రాణి ముఖర్జియా అరెస్ట్ అయింది.

  హత్యకు కారణాలు...
  షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీని బ్లాక్‌మెయిల్‌ చేసిందని తెలుస్తోంది. బాంద్రా (వెస్ట్‌) ప్రాంతంలో ఉన్న మూడు బెడ్‌రూంల ఫ్లాట్‌ను తనకు ఇవ్వాలంటూ కొంతకాలంగా ఇంద్రాణిని షీనా బెదిరించేదని, ఆమె హత్యకు ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. షీనా హత్యకేసులో ఆమె తల్లి ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్‌ ఖన్నా, డ్రైవర్‌ శ్యాంవర్‌ రాయ్‌లను కూడా విచారించారు. షీనాను హత్య చేసే సమయంలో ఇంద్రాణి చాలా హింసాత్మకంగా భయంకరంగా ఉందని డ్రైవర్‌ రాయ్‌ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. కారులో షీనాను హత్య చేస్తున్నప్పుడు ఇంద్రాణి పదేపదే 'మూడు బెడ్‌రూంల ఇల్ల్లు ఇప్పుడు తీసికో' అంటూ కలవరించినట్టుగా అందని రాయ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్‌ ముఖర్జీ, ఆయనకు మొదటి భార్య వల్ల కలిగిన కుమారుడు రాహుల్‌ ముఖర్జీ, ఇంద్రాణి కొడుకు, షీనాబోరా సోదరుడు అయిన మిఖాయెల్‌ బోరాలను పోలీసులు విచారించిన సమయంలో కూడా పలు విషయాలు వెలుగు చూశాయి.

  ఇంద్రాణి రహస్యాలన్నీ ప్రస్తుత భర్త పీటర్‌తో చెప్పేస్తానని, ఆన్నీ బయటపెడతానంటూ షీనా బ్లాక్‌మెయిల్‌ చేసేదని వారు చెప్పినట్లు తెలిసింది. రహస్యాలు వెల్లడించవద్దని, నోరుమూసుకోవాల్సిందిగా ఇంద్రాణి తన కూతురు షీనాకు చాలా సార్లు చెప్పింది. అయితే తాను మౌనంగా ఉండాలంటే బాంద్రాలో ఉన్న మూడు పడకల ఫ్లాట్‌ను ఇవ్వాలని షీనా డిమాండ్‌ చేసేదని డ్రైవర్‌ రాయ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సంజీవ్‌ ఖన్నా ధృవీకరించాడు. రాహుల్‌ను పెళ్లి చేసుకుంటానని షీనా తన తల్లి ఇంద్రాణితో చెప్పడంతో ఆమె వ్యాకులం చెందిందని, వారిద్దరు అన్నాచెలెళ్లు అవుతారని, అందువల్ల ఆ సంబంధం వద్దని ఇంద్రాణి పదేపదే చెప్పినప్పటికీ షీనా వినకపోగా రహస్యాలన్నీ బయటపెట్టేస్తానని తల్లిని బెదిరించేదని చెప్పారు. అయితే షీనా పుట్టుక రహస్యం తెలియని పీటర్‌ రాహుల్‌తో సంబంధానికి షీనాకు అడ్డుచెప్పలేదు. ఆస్తులే షీనా హత్యకు మూడో కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్‌తో షీనా పెళ్లి అయితే పీటర్‌ ఆస్తులపై తనకు హక్కు ఉండదనే ఆలోచనతో అభద్రతాభావానికి ఇంద్రాణి గురయ్యేదని పోలీసులు తెలిపారు.

  English summary
  The first look poster of ‘Dark Chocolate’ a film based on ‘Sheena Bora’ murder case accused Indrani Mukerjea, has been released. Directed by Agnidev Chatterjee, the Bengali film stars Mahima Chaudhry and Riya Sen in the lead.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X