»   » సుకుమార్ నుండి సరికొత్త చిత్రం ‘దర్శకుడు’ (ఫస్ట్ లుక్)

సుకుమార్ నుండి సరికొత్త చిత్రం ‘దర్శకుడు’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్.... ఓ వైపు డైరెక్టర్ గా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే 'సుకుమార్ రైటింగ్స్' అనే బేనర్ స్థాపించి నిర్మాతగా చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'సుకుమార్ రైటింగ్స్' బేనర్లో తెరకెక్కిన తొలి మూవీ 'కుమారి 21 ఎఫ్' మంచి విజయం అందుకుంది.

తాజాగా ఈ బేనర్లో మరో సినిమా రాబోతోంది. 'దర్శకుడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రానకి హర్ 'హిస్ పాషన్..హర్ లవ్' అనేది సబ్ టైటిల్. ఈ చిత్రం ద్వారా సుకుమార్ అన్నయయ కొడుకు అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ వద్ద అసిస్టెంటుగా పని చేసిన హరిప్రసాద్ జక్కా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఫస్ట్ లుక్ రిలీజ్

ఫస్ట్ లుక్ రిలీజ్

‘దర్శకుడు' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్ థామస్ ఆదూరి, సత్తినదీర్ రవిచంద్ర నిర్మిస్తున్నారు. సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

సినిమా కాన్సెప్టు

సినిమా కాన్సెప్టు

దర్శకుడు హరిప్రసాద్ జక్కా గతంలో సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు. పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలంటే ఎంత కష్టపడాలి.. దర్శకుడిగా మారే క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు.

హీరోయిన్లు

హీరోయిన్లు

ఈ చిత్రంలో ఇషా, పూజిత కథానాయికలు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలాంటి కాన్సెప్టుతో తెలుగులో పలు సినిమాలు వచ్చినా... ఇది కాస్త భిన్నంగా, ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.

మరిన్ని వివరాలు

మరిన్ని వివరాలు

బ్రహ్మాజీ, ధన్‌రాజ్, కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: రామచంద్రాసింగ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా, లైన్ ప్రొడ్యూసర్:వీఈవీకేడీఎస్ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరిప్రసాద్ జక్కా.

English summary
"DARSHAKUDU" movie first look released. Director Sukumar is all set to introduce his brother's son Ashok as a hero with this film. Sukumar's assistant Hari Prasad is helming the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu