»   » 'పరమవీరచక్ర' ఫ్లాపు గురించి ఇప్పుడవసరమా?

'పరమవీరచక్ర' ఫ్లాపు గురించి ఇప్పుడవసరమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ చిత్రం 'పరమవీరచక్ర' . దాసరి నారాయణ రావు ఎన్నో అంచనాలతో చేసిన ఈ చిత్రం ఊహించవి విధంగా బోల్తా కొట్టింది. అయితే ఇంకా ఈ సినిమా గురించి ఇంకా మీడియా ఆయన్ను వెంటాడుతూనే ఉంది.
ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగానూ మీడియా వారు ఆయన్ని ఆ చిత్రం ఫ్లాప్ గురించి అడగటం ఆయన్ను అసహానానికి గురి చేసింది. అయితే ఆయన కూల్ గా సమాధానమిచ్చారు.

దాసరి మాట్లాడుతూ... ఇప్పటికీ చెబుతున్నా. మంచి సినిమా అది. బాలకృష్ణ అత్యుత్తమ ప్రదర్శనల్లో తప్పకుండా ఈ సినిమా ఉంటుంది. కథని నమ్ముకొని చేసిన ప్రయత్నం. కానీ జనాలకు కథ కాదు.. ఇంకేదో జిమ్మిక్కులు కావాలని అర్థమైంది. వాళ్లు కోరుకొనే ట్రెండ్‌లో ఆ సినిమా లేదు. అలాంటి ట్రెండ్‌లో నేను సినిమా చేయలేను. ఒకవేళ సినిమా అంటే అలానే తీయాలి అనుకొన్నప్పుడు.. పూర్తిగా సినిమాలకు దూరమవుతా అన్నారు ఆయన.

Dasari about Parama Veera Chakra Movie Flop

ప్రకాష్ రాజ్ ఇష్యూని గుర్తు చేసుకుంటూ మీడియా ప్రశ్నించినప్పుడు.... దర్శకుడే కెప్టెన్‌ అన్నది నా సిద్ధాంతం. కానీ రోజులు మారాయి.. కొంతమంది నటులు సెట్లో దర్శకుడిపై కూడా జులుం చూపిస్తున్నారు..నా సెట్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. 'స్వర్గం నరకం' హిందీ సినిమా చేస్తున్నా. హీరోయిన్ సహాయ దర్శకుడిపై నోరుజారింది. ఆ నాయిక చేత సహాయ దర్శకుడికి క్షమాపణలు చెప్పించి మళ్లీ షూటింగ్‌ మొదలెట్టా. అంత క్రమశిక్షణ సెట్లో ఉండాలి. అలా లేకపోతే అది దర్శకుడి వైఫల్యమే అన్నారు.

English summary
Dasari Narayana Rao said that he is very much liked Parama Veera Chakra Movie. He Said it is a Story based Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu