twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలపై దాసరి మరో సారి విసుర్లు

    By Srikanya
    |

    హీరోల్ని దర్శకులే తయారుచేస్తారనీ, హీరోల మత్తులో దర్శకులు వారి వెంట పడొద్దనీ దర్శకరత్న దాసరి నారాయణరావు హితవు పలికారు. అలాగే ప్రతి హీరో కూడా చిన్న సినిమాతో, చిన్న హీరో నుంచి పైకొచ్చినవాడేనని ఆయన మరోసారి స్టార్ హీరోలపై విసుర్లు విసిరారు. 54 కేంద్రాల్లో యాభై రోజులు ఆడిన 'అలా మొదలైంది' చిత్రం అర్థ శతదినోత్సవ వేడుక శిల్పారామంలో జరగగా, ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి, ఆ సినిమా యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు అందజేస్తూ ఇలా స్పందించారు. అలాగే రెచ్చగొట్టే వస్తధ్రారణతో నీలి చిత్రాల్లా సినిమాలను తీస్తున్న ప్రస్తుత పరిస్థితిలో.. మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ చక్కని చిత్రాన్ని తీసిన దర్శకురాలు నందినిరెడ్డికి హ్యాట్సాఫ్. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ చిత్రం ఇది. ఈ మధ్యకాలంలో ఇంత జెన్యూన్ హిట్ రాలేదు. నా మిత్రుడు రంజిత్‌కుమార్ తనయుడు దామోదర్‌ప్రసాద్ ఇంత చక్కని చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది అన్నారు.

    English summary
    Dasari Narayana Rao in his usual self has praised Nandini Reddy’s talent and her belief in good cinema. Ala Modalaindi, has completed fifty days run and the fifty days function was held at Mountain Heights, Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X