»   » డ‌బ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇది సరైంది కాదు: దాసరి

డ‌బ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇది సరైంది కాదు: దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీ వారిని కొందరు మీడియా వారు రేటింగులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ దర్శక రత్న దాసరి సంచలన కామెంట్ చేసారు. నారా రోహిత్, శ్రీ విష్ణు న‌టించిన అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు సినిమా స‌క్సెస్‌మీట్లో దాసరి ఈ కామెంట్ చేసారు.

దాసరి మాట్లాడుతూ...దాదాపు అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. గ‌త రెండేళ్ల క్రితం తెలుగు సినిమా పరిస్థితి చూసి జాలిప‌డ్డాను. చాలా దిగ‌జారుడుగా అనిపించింది. కానీ ఇప్పుడు చాలా బావుంది. చిన్న సినిమాలే ప‌రిశ్ర‌మ‌కు ఊపిరి. చిన్న సినిమా అనేది త‌ల్లిగ‌ర్భం లాంటిది అని దాసరి అన్నారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

అప్పట్లో ఒకడు ఉండే వాడు చాలా బావుంది. నారా రోహిత్ చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. మంచి క‌థ‌లతో ముందుకెళ్తున్నాడు. శ్రీవిష్ణు చాలా చ‌క్క‌గా చేశాడు. ఇలాంటి సినిమాల‌కు మీడియా స‌పోర్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. అయితే అక్క‌డ కూడా ఒక‌టీ రెండు చీడ‌పురుగులు ఉన్నాయి. డ‌బ్బుల కోసం రేటింగుల‌తో బ్లాక్ మెయిల్ చేయ‌డం స‌రికాదు అని దాసరి వ్యాఖ్యానించారు.

ఎంతో కాలం భరించరు

ఎంతో కాలం భరించరు

బ్లాక్ మెయిల్ చేస్తూ పోతే ఎవరూ ఎంతో కాలం భ‌రించ‌రు. రేటింగుల మీద చాలా మంది జీవితాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని తెలుసుకున్న‌ప్పుడు బాధ్య‌త‌తో రాయాలి. ఓవ‌ర్సీస్‌లో వీటి ప్ర‌భావం ఉంటుందనే విష‌యాన్ని గ్ర‌హించాలి. ఈ విష‌యాల‌ను నేను స‌దుద్దేశంతోనే అంటున్నాను. గుడ్ ఫిల్మ్ ప్ర‌మోట‌ర్స్ అని త్వ‌ర‌లోనే ఓ ఆరుగురితో టీమ్‌ను ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్నాను అని దాసరి తెలిపారు.

ఈ చిత్రం మెమ‌ర‌బుల్‌గా ఉంది

ఈ చిత్రం మెమ‌ర‌బుల్‌గా ఉంది

నారా రోహిత్ మాట్లాడుతూ ``ఈ సినిమా జ‌ర్నీ నాకు చాలా మెమ‌ర‌బుల్‌. శ్రీ విష్ణు బాణం నుంచి నాతోనే ఉన్నాడు. ఈ క‌థ‌ను త‌ను నాక‌న్నా బాగా న‌మ్మాడు. మా న‌మ్మ‌కం నిజ‌మైంది. జ‌న‌వ‌రి 6న విడుద‌ల చేస్తే మాకు కేవ‌లం 5 రోజులే ఉంటాయ‌ని ముందుగానే విడుద‌ల చేశాం. కంటెంట్ ను నమ్ముకుని అలా చేశాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రో 100 థియేట‌ర్ల‌ను పెంచుతున్నాం. 2016లో హిట్లూ, ఫ్లాప్‌లూ, యావ‌రేజ్‌లు ఉన్నాయి. అయ‌తే ఈ చిత్రం మెమ‌ర‌బుల్‌గా ఉంది`` అని చెప్పారు.

థియేటర్లు పెరిగాయి

థియేటర్లు పెరిగాయి

శ్రీవిష్ణు మాట్లాడుతూ ``చిన్న చిత్రంగా మొద‌లుపెట్టాం. త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశాం. ఈ వారం నుంచి థియేట‌ర్లు పెరుగుతున్నాయి`` అని అన్నారు.

ధైర్యం చేసాం, ఇపుడు హ్యాపీ

ధైర్యం చేసాం, ఇపుడు హ్యాపీ

నిర్మాత విజ‌య్ మాట్లాడుతూ ``ముందు డిసెంబ‌ర్ 30న వ‌ద్ద‌నుకున్నాం. కానీ ధైర్యం చేసి రిలీజ్ చేశాం. ఇప్పుడు థియేట‌ర్లు రెట్టింపు కావ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

దర్శకుడు

దర్శకుడు

ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర మాట్లాడుతూ ``ఈ స‌క్సెస్‌ని మ‌ర్చిపోలేను రోహిత్‌గారిని మ‌ర్చిపోలేను. శ్రీవిష్ణు అన్ని ఎమోష‌న్స్ ని పండించారు. ఆయ‌న‌తో చేస్తుంటే రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో చేసిన ఫీలింగ్ వ‌చ్చింది`` అని అన్నారు.

English summary
Appatlo Okadundevadu Movie Success Meet held at Hyderabad. Dasari Narayana Rao, Nara Rohit, Sree Vishnu, Rajiv Kanakala, Sagar K Chandra, Prashanti, Krishna Vijay, Sai Karthik, GV Sudhakar Naidu graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu