దాసరిని పిలిచినందుకు భలే శాస్త్రి జరిగింది

By Srikanya

ఈ మధ్య కాలంలో దాసరి నారాయణరావు ని ఏదన్నా సినిమా పంక్షన్ కి పిలవాలంటే భయపడుతున్నారు.ఆయన ఎప్పుడు ఏ కామెంట్ చేస్తారో అన్నట్లు స్టేజీపై ఉన్న జనం భయంతో చూస్తున్నారు.తాజాగా జబ్ వి మెట్' చిత్రాన్ని తమిళ రీమేక్ 'కండేన్ కాదలై'ని తెలుగులో తెలుగులో 'ప్రియా ప్రియతమా' అనే పేరుతో డబ్బింగ్ చేసారు.భరత్,తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఆడియో పంక్షన్ కి దాసరి గారిని పిలవటం జరిగింది.ఆయన పంక్షన్ ఏమిటనేది ప్రక్కన పెట్టి ఆ నిర్మాతమీదే విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ..డబ్బింగ్ సినిమాలు మన సినిమాలను దెబ్బతీస్తున్నాయన్నది నా అభిప్రాయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను అని షాక్ ఇచ్చారు.అది విన్న వారంతా ఏదో ఈ సినిమా గురించి నాలుగు మంచి ముక్కలు చెప్తాడు అనుకుంటే ఇలా అన్నాడేమిటి అని ఆశ్చర్యపోయారు.అయితే తమన్నాని ఏమీ కామెంట్ చేయకపోవటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.తమన్నా గురించి ఆయన..'హ్యాపీడేస్' సమయంలోనే తమన్నా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పాను. ఇటీవల వచ్చిన '100% లవ్'లోనూ బాగా నటించింది అన్నారు.ఇక ఈ ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. డాక్టర్ దాసరి నారాయణరావు తొలి సీడీని విడుదల చేశారు. తొలి ప్రతిని తమన్నాకు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X