twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు అన్నంపెట్టారు: దాసరి సంతాప సభలో చిరంజీవి ఉద్వేగం!

    ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు సంతాప సభ శ‌నివారం రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మే 30న మరణించిన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తరుపున శ‌నివారం రామానాయుడు స్టూడియోలో సంతాప స‌భ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

    చైనా టూర్ ముగించుకుని తిరిగి వచ్చిన చిరంజీవి కూడా సంతాప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. తనకు దాసరి కడసారి చూపు దక్కక పోవడం ఎంతో అసంతృప్తిని కలిగించిందని చెప్పుకొచ్చారు.

    ఆ సందర్బాలను గుర్తు చేసుకున్న చిరంజీవి

    ఆ సందర్బాలను గుర్తు చేసుకున్న చిరంజీవి

    విదేశాల్లో ఉండటం వల్లనే తాను దాసరి కడసారి చూపుకు నోచుకోలేక పోయానని చెప్పిన చిరంజీవి.... ఈ సందర్భంగా దాసరితో గడిపిన చివరి క్షణాలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయ‌న క‌డ‌సారి మాట్లాడిన ప‌బ్లిక్ ఫంక్ష‌న్ నేను నటించిన ఖైదీ నెం 150వ చిత్రమే అని, తర్వాత దాసరి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అల్లు రామ‌లింగ‌య్య అవార్డును అంద‌చేసిన‌ప్పుడు ఆయన ఆఖ‌రిసారిగా ప్రెస్‌తో మాట్లాడి త‌న ఆశీస్సులు అంద‌చేశారు...అది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.

    మాట్లాడలేని పరిస్థితిలో కూడా...

    మాట్లాడలేని పరిస్థితిలో కూడా...

    దాసరిగారు హాస్పిట‌ల్‌లో ఉండ‌గా వెళ్ళి క‌లవ‌గానే ఆయ‌న నన్ను చూసి మాట్లాడలేని పరిస్థితుల్లో పేప‌ర్‌పై నీ సినిమా స్కోరెంత అని రాశారు.... అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా సినిమా పట్ల ఉన్న ఉత్సాహాన్ని చూస్తుంటే సంతోషం అనిపించింది. హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ అని చెప్ప‌గానే చిన్న‌పిల్లాడిలా విజ‌య సంకేతం చూపి చ‌ప్ప‌ట్లు కొట్టారు. అంతటి సంతోషాన్ని మా విజయం పట్ల వ్యక్తం చేశారు అని చిరంజీవి తెలిపారు.

    అన్నం పెట్టారు

    అన్నం పెట్టారు

    ఆ మధ్య వారింట్లో ఓ స‌మావేశం జ‌రిగిన‌ప్పుడు మేమంతా వెళ్లారు. ఆసమయంలో నేను షూటింగ్ ఉంది వెళతానని చెప్పినపుడు ఆయన చూపిన ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. నువ్వు ఎలాగైనా మా ఇంట్లో భోంచేసి వెళ్లాలని కూర్చోబెట్టి ఆయన దగ్గరుడి అన్నంపెట్టారు... మన జిల్లా నుండి వచ్చని బొమ్మిడాయిలు అని చెప్పి వడ్డించి నా పట్ల పితృ వాత్స‌ల్యాన్ని చూపించారు. అది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చిరంజీవి తెలిపారు.

    వాళ్లంతా అనాధలయ్యారు

    వాళ్లంతా అనాధలయ్యారు

    దాసరి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని, సినీ కార్మికులంద‌రూ తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయి అనాథ‌ల‌య్యారు. ఆయ‌న లేని లోటు ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. దాసరి కార్మికుల కష్టాలను ఓన్ చేసుకుని పరిష్కరించారు. వాళ్ల కష్టాన్ని తన కష్టంగా భావించేవారు. అలాంటి గొప్ప వ్యక్తి లేకుండా పోవడం చాలా చాలా పెద్ద లోటు అన్నారు.

    గీతా ఆర్ట్స్‌కు పునాది వేసింది దాసరే

    గీతా ఆర్ట్స్‌కు పునాది వేసింది దాసరే

    ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మాట్లాడుతూ..... మా గీతాఆర్ట్స్ సంస్థకు ఆయన సినిమాల ద్వారానే పునాది పడిందని తెలిపారు. పాల‌కొల్లులో మా నాన్న‌గారికి, దాస‌రిగారికి రిలేష‌న్ ఉన్నా, నాకు చెన్నైలోనే తెలుసు. ఆయ‌న డైరెక్ట‌ర్ కాబోతున్న స‌మ‌యంలో న‌న్ను పాండిచ్చేరిలో క‌లిసి మాట్లాడారు. నాన్న‌గారు నిన్ను ఫిలిం ఇండ‌స్ట్రీకి ర‌మ్మంటే నువ్వు రాన‌ని అన్నావంట‌..నువ్వు రా..అని అన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న తాతా మ‌న‌వ‌డు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇండ‌స్ట్రీలోకి న‌న్ను ర‌మ్మ‌ని ఆహ్వానించిన వారిలో దాసరిగారే ప్ర‌థ‌ములు. నా తొలి సినిమా బంట్రోతు భార్య‌కు ఆయ‌నే ద‌ర్శ‌కుడు. త‌ర్వాత దేవుడే దిగి వ‌స్తే సినిమాను కూడా ఆయ‌నే డైరెక్ట్ చేశారు. మా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ పునాదులు బ‌లంగా వేయ‌డంలో ఆయ‌నెంతో స‌పోర్ట్ చేశారు. దాసరిగారు ఇండ‌స్ట్రీకి, వ‌ర్కర్స్‌కు మ‌ధ్య వార‌ధిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అని దాసరి అన్నారు.

    దాసరికి దాదా ఫాల్కే అవార్డు వచ్చేలా చూడాలి

    దాసరికి దాదా ఫాల్కే అవార్డు వచ్చేలా చూడాలి

    ఆర్.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ - ``నేను సినిమా రంగంపై ఆస‌క్తితో చెన్నైకి డిగ్రీ పూర్తి చేయ‌కుండానే వెళ్లాను. దాసరిగారిని వెళ్ళి క‌లిశాను. ఆయ‌న నువ్వు ముందు డిగ్రీ పూర్తి చేసి రా..త‌ప్ప‌కుండా అవ‌కాశం ఇస్తాన‌ని అన్నారు. నేను డిగ్రీ పూర్తి చేసి వెళ్ల‌గానే అన్న‌మాట ప్ర‌కారం నాకు నీడ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న చేయ‌ని జోన‌ర్ సినిమా లేదు. ఎవ‌రికీ ఏ క‌ష్టం ఉన్నా త‌లుపు త‌డితే ప‌లికే వ్య‌క్తి ఆయ‌నే. రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి ఆయ‌న‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డువంటిది వ‌చ్చేలా చూడాలి. తెలుగు చిత్ర సీమ హైద‌రాబాద్‌కు రావ‌డంలో దాస‌రిగారి కృషి కూడా ఎంతో ఉంది అని ఆయన తెలిపారు.

    అక్షరాలు సరిపోవు

    అక్షరాలు సరిపోవు

    పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ - ``దాస‌రిగారి గురించి చెప్పాలంటే తెలుగు భాష‌లోని అక్ష‌రాలు స‌రిపోరు. ఆయ‌న‌లాంటి మ‌హానుభావులు ఇండ‌స్ట్రీలో పుట్ట‌రు`` అన్నారు.

    వేణు మాధవ్

    వేణు మాధవ్

    వేణుమాధ‌వ్ మాట్లాడుతూ - ``దాస‌రిగారు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, ర‌చ‌యిత‌గా, వ‌క్త‌గా ఎంతో గొప్ప వ్య‌క్తి. మంచి మ‌నిషి. ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం కార్మికుల‌కు అండ కోల్పోయిన‌ట్లు అయ్యింది`` అన్నారు.

    దాసరి ఉంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేది

    దాసరి ఉంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేది

    ఆది శేష‌గిరిరావు మాట్లాడుతూ... దాసరి అందరికీ ఎంతో సపోర్టుగా ఉండేవారు. ఆయ‌న ఇండ‌స్ట్రీకి చేసిన సేవ‌లే పెద్ద అవార్డులు. ఆయ‌న దాదా సాహెబ్ ఫాల్కే క‌న్నా గొప్ప వ్య‌క్తి. జిఎస్‌టి వ‌ల్ల సినిమా రేటు పెరిగింది. ఇప్పుడు దానిపై ఇండస్ట్రీ ఆలోచించి చ‌ర్య‌లు తీసుకోవాలి. దాస‌రిగారి వంటి వ్య‌క్తి ఉంటే ఈ స‌మ‌స్య‌కు ఎప్పుడో ప‌రిష్కారం దొరికేది`` అన్నారు.

    దాసరి క్రమశిక్షణ పుణ్యమే

    దాసరి క్రమశిక్షణ పుణ్యమే

    కె.య‌స్‌.రామారావు మాట్లాడుతూ - ``దాసరిగారి నేర్పిన క్ర‌మ‌శిక్ష‌ణ కార‌ణంగానే తెలుగు సినిమా ఇప్ప‌టికీ బావుంది. అంద‌రూ అదే బాట‌లో న‌డ‌వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

    English summary
    Dasari Narayana Rao candolence meeting organised by Telugu Film Industry at Film Chamber today (10th June).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X