»   » రుద్రమదేవి ప్రెస్‌మీట్: చెర్రీ సినిమాపై దాసరి కామెంట్?

రుద్రమదేవి ప్రెస్‌మీట్: చెర్రీ సినిమాపై దాసరి కామెంట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ దసర పండక్కి తెలుగు బాక్సాఫీసు వద్ద పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు పెద్ద సినిమాలు ఈ సారి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రూ. 80 కోట్ల బడ్జెట్ మూవీ ‘రుద్రమదేవి' విడుదలైన డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కేవలం 1 వారం గ్యాపుతో అంటే అక్టోబర్ 16న రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' విడుదల కాబోతోంది. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

మరో వైపు అఖిల్ నటించిన తొలి సినిమా కూడా ‘బ్రూస్ లీ'కి వారం గ్యాపుతో అక్టోబర్ 22న విడుదల చేయాలని నిర్ణయించారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇలా పెద్ద సినిమాలన్నీ తక్కవ గ్యాప్ తో విడుదల కావడం వ్యాపార పరంగా అంత మంచిది కాదని అంటున్నారు.

Dasari

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. రుద్రమ దేవి చారిత్రక చిత్రం, ఇలాంటి సినిమాలు బ్రతకాలంటే మరుసటి వారం పెద్ద సినిమాలు విడుదల కావడం మంచిది కాదు. పెద్ద హీరోలు కూడా పండుగల కోసం వెంపర్లాడటం బాధాకరం అని దాసరి అన్నట్లు తెలుస్తోంది. దాసరి కామెంట్స్ రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా గురించే అని అంటున్నారు.

రుద్రమదేవి గురించి దాసరి మాట్లాడుతూ...ఆదివారం రాత్రి ‘రుద్రమదేవి' సినిమా చూశాను. ఇది చాలా డేంజర్ జానర్. హిస్టారికల్ సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. అల్లూరి సీతారామరాజు తాండ్ర పాపారాయుడు తర్వాత తెలుగులో వచ్చిన తొలి చారిత్రక సినిమా రుద్రమదేవే. ఐతే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం చాలా పెద్ద సాహసం. కమర్షియాలిటీ పేరుతో ఏదేదో చేస్తున్నారు. నేనైతే ఈ రోజుల్లో రుద్రమదేవి లాంటి సాహసోపేత సినిమా చేసేవాణ్ని కాదు. మరి గుణశేఖర్ ఎందుకంత ధైర్యం చేశాడో తెలియదు. రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పాలన్న మక్కువతోనే సినిమా చేసినట్లున్నాడు. చాలా ఏళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టం అలాంటిలాంటిది కాదు. అది అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగా ఆడాలని కోరుకున్నారు' అన్నారు.

మరో వైపు బ్రూస్ లీ సినిమా విడుదల వాయిదా వేయాలని కోరుతూ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చిరంజీవికి లేఖ రాసారు. బాహుబలి సినిమా విడుదల సమయంలో నిర్మాతల కోరిక మేరకు మహేష్ బాబు ‘శ్రీమంతుడు' వాయిదా వేసిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, బ్రూస్ లీ సినిమాను వాయిదే వేయాలని ఆ లేఖలో కోరారు.

English summary
In a press meet just a while ago, Dasari said that Rudhramadevi would create history if the film which is releasing on the 16th will postpone its release at least by a week. Dasari opined that such competition is not a healthy trend for Tollywood.
Please Wait while comments are loading...