»   » జయ ఇంట్లో దాసరి నాలుగు సినిమాలు: కన్నీరు మున్నీరైన గౌతమి

జయ ఇంట్లో దాసరి నాలుగు సినిమాలు: కన్నీరు మున్నీరైన గౌతమి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై/ హైదరాైబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటి జయలలిత మృతికి తెలుగు సినీ ప్రముఖులు పలువురు సంతాపం ప్రకటించారు. ఆమెతో తమకు గల అనుబంధాన్ని నెమరేసుకున్నారు. జయలలిత మానవతావాదం, స్నేహశీలత వారి మాటల ద్వారా తెలియవస్తోంది.

జయలలిత ఎన్టీఆర్‌తో 12 సినిమాల్లో, అక్కినేని నాగేశ్వర రావుతో ఏడు సినిమాల్లో నటించారు. కృష్ణ గూఢచారి 116లో కూడా ఆమె ఉన్నారు. జయ తన పొయెస్ గార్డెన్‌లో తన ఇంట్లో షూటింగ్‌లకు అనుమతించలేదని, తన చిత్రాలకు కూడా షూటింగ్‌లు చేయలేదని...అలాంటిది ఆమె ఇంట్లో నాలుగు షూటింగ్‌లు చేశానని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు చెప్పారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి వార్త విషాదకరమని సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు అన్నారు. సినిమాల్లో నవరసాలు పండించిన ఆమె రాజకీయాల్లో కూడా అలాగే రాణించారని అన్నారు. జయ ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్పరెన్స్‌లో ప్రతి అంశానికి, ప్రతి పదానికి విడమరిచి, వివరంగా సమాధానం చెప్పారని ఆయన అన్నారు.

ఆమె ఇంట్లో నాలుగు సినిమాల షూటింగ్

ఆమె ఇంట్లో నాలుగు సినిమాల షూటింగ్

గోరంటాకు, అభిమన్యుడు, బహుదూరపు బాటసారి, హిందీ ఫిల్మ్..మెహందీ రంగ్ లాయేగి అనే చిత్రాల షూటింగ్‌ను తాను జయలలిత ఇంట్లో చేసినట్లు దాసరి నారాయణ రావు చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే షూటింగ్ జరిగినన్నిరోజులు ఆ ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశారని అన్నారు. సినీరంగంలో తమిళనాడు, తెలుగునాట మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని దాసరి కొనియాడారు. ఆమె చేసిన చిత్రాలు ఇప్పటికీ ఆణిముత్యాలని అన్నారు. రాజకీయాల్లో కూడా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆయన అన్నారు.

కృష్ణం రాజుకు జయతో పుస్తకాల అనుబంధం

కృష్ణం రాజుకు జయతో పుస్తకాల అనుబంధం

జయకు తనకు ఉన్నబంధం పుస్తకాలే అని కృష్ణంరాజు అన్నారు. తాను కొన్న పుస్తకం ఆమె కొనేదని, జయ వద్ద ఉన్న పుస్తకాలు తనకు ఇచ్చేవారని ఆయన అన్నారు. ఆమె ఎంజీఆర్‌కు కూడా సలహాలు ఇచ్చేవారని, జయ, ఎంజీఆర్ ఆశయాలు ఒకటే కావడంవల్ల, ఎంజీఆర్ పేరు, ఆశయాలు నిలబెట్టాలని జయ రాజకీయాల్లోకి దిగి కష్టపడి సీఎం అయ్యారని, తమిళనాడు ప్రజలకు సేవ చేశారని కృష్ణంరాజు చెప్పారు. ప్రజలకు ఏం కావాలో అది చేశారని ఆయన కొనియాడారు. జయ లేని లోటు తమిళనాడు ప్రజలకే కాదు, భారత దేశానికే తీరని లోటని అన్నారు.

జయ మృతికి కన్నీరు మున్నీరైన గౌతమి

జయ మృతికి కన్నీరు మున్నీరైన గౌతమి

రాజాజీ హాలుకు చేరుకుని జయలలిత భౌతికకాయంపై నటి గౌతమి పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. జయ పార్థివ దేహాన్ని చూసి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జయలలిత ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని, అభిమానులు, ప్రజల గుండెల్లో ఆమ్మగా ఆమెకున్న స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదని గౌతమి అన్నారు.

అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావయ్యా

అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావయ్యా

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలుగుదేశం పార్టీ ఎంపి, సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. అమ్మ క్యాంటిన్, అమ్మ ఉప్పు, వైద్యం...ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన అమ్మ ఇక లేరంటే చాలా బాధగా ఉందని ఆనయ అన్నారు. తెలుగు సినిమా రంగంలో ఒక వ్యక్తిగా, తెలుగు సినీ రంగం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జయకు నివాళులర్పిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ ఆమె నటించిన సినిమాలో ఓ పాటను గుర్తు చేశారు. ‘అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా... జయలలితను అప్పుడే తీసుకువెళ్లిపోయావేమయ్యా' అని అన్నారు.

నా సరసన ఆ రెండు సినిమాల్లో...

నా సరసన ఆ రెండు సినిమాల్లో...

జయలలితతో తనకు గల అనుబంధాన్ని సూపర్ స్టార్ కృష్ణ గుర్తు చేసుకున్నారు. గూఢచారి 116లో జయలలిత తన పక్కన నటించారని, ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్‌ ఇమేజ్‌ వచ్చిందని ఆయన అన్నారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదని, నిలువుదోపిడి సినిమాలో కూడా తన పక్కన ఆమె నటించారని, ఆ సినిమా కూడా హండ్రెడ్‌ డేస్‌ ఆడిందని ఆయన చెప్పారు.
అలాగే తాము సొంతంగా నిర్మించిన సినిమా దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఎన్టీ రామారావు పక్కన ఆమె హీరోయిన్‌గా నటించిందని, అది కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం తమిళనాడు ప్రజలకి తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

రాజీవ్ గాంధీ తర్వాత జయనే

రాజీవ్ గాంధీ తర్వాత జయనే

జయలలితగారు చనిపోవడం అందర్నీ బాధించే విషయమని ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు. ఒక మహిళగా ఎంత అపొజిషన్‌ వున్నప్పటికీ ఎంతో ధైర్యంగా నిలబడి తమిళనాడుని పరిపాలించారని, నిరుపేదలు కంటతడి పెట్టకూడదని వారికి అన్ని సదుపాయాలు కల్పించారని విజయనిర్మల అన్నారు. ఆమె చనిపోయిందన్న వార్త తెలిసిన తర్వాత అభిమానుల కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయని, వార్త విన్న వెంటనే నలుగురు హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయారని అన్నారు. రాజీవ్ గాంధీగారి తర్వాత అంతటి అభిమానం సంపాదించుకున్న పొలిటీషియన్‌ జయలలిత అని విజయనిర్మల అన్నారు.

English summary
Dasari narayana rao, krishnam raju, Murali Mohan and others condoled the dath of Jayalalithaa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu