»   » మరో సంచలనం అవుతుందా? ఆమె బయో పిక్ గురించి దాసరి ఇలా..?

మరో సంచలనం అవుతుందా? ఆమె బయో పిక్ గురించి దాసరి ఇలా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాసరి నారాయణ రావు తెలుగు సినీ దర్శక దిగ్గజం ఎవర్నైనా ఎక్కడైనా ఎవరితో అయినా ఒకేలాగా ఉండగలగటం దాసరిని ఇండస్ట్రీలోనే ఒక టిపికల్ మ్యాన్ గానిలబెట్టింది. తప్పు ఉందీ అంటే ఎవరినైనా బాహాటంగానే విమర్శించటం, చిన్న సినిమా అయినా బావుందీ అనిపిస్తే ఆ యూనిట్ మొత్తాన్ని పిలిచి మర్రీ సత్కరించి గుండేలకు హత్తుకోవటం..

ఏ రెండిటిమధ్యా నేనొక గొప్ప మనిషినీ, ఇలాగే ఉండాలి అనే ఆలోచనే ఉండని బోళా తనాన్ని కలుపుకొని ఇలా నిలబడటం దాసరికి మాత్రమే సాధ్యమయ్యింది. 'నేను నా జీవిత చరిత్ర రాస్తున్నా..ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలైంది అది రాయడం మొదలుపెట్టి...పూర్తి కావడానికి ఇంకా యేడాదిన్నర పడుతుంది. అందులో చాలా వాస్తవాలు ఉంటాయి. మహామహా గొప్పవాళ్లు, పెద్దవాళ్లు అని అనుకువాళ్ల అసలు చరిత్రంతా దాంట్లో ఉంటుంది' అని దసరి ప్రకటించగానే పెద్ద కలకలమే రేగింది. ఇప్పుడు మళ్ళీ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ఒకనాటి పాపులర్ నటి అయిన జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా ఉంటుందీ అని ప్రకటించటం ఇప్పుడు మరో సంచలనం... తాజాగా తెలుగు దిన పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పుకొచ్చారు దాసరి....

ఒక కల్పిత కథ:

ఒక కల్పిత కథ:

ఇది ఒక కల్పిత కథ. జయలలిత కథ అయితే.. ఆమె చుట్టూ ఉన్న పాత్రలు కూడా ఉండాలి. కానీ దీనిలో అవి ఉండవు. ఈ సినిమాలో హీరోయిన్‌.. మచ్చ లేని మహానాయకురాలు. ప్రజల ఆదరణ పొంది.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.. చివరకు దహన సంస్కారాలు చేయటానికి కూడా ఎవరూ లేక ఒంటరిగా వెళ్లిపోయిన ఒక మహానాయకురాలి కథ.

 చదువుకున్న అమ్మాయి:

చదువుకున్న అమ్మాయి:

జయలలిత ఒక తెలుగు అమ్మాయిగానే నాకు తెలుసు. ఆమె హీరోయిన్‌గా వెలుగుతున్న సమయానికే నేను డైరెక్టర్‌ని. అప్పట్లో ఆమె ప్రవర్తన మీద అనేక కథలు వినిపించేవి. ఆమె చదువుకున్న అమ్మాయి. షాట్‌ అయిపోగానే వచ్చి కూర్చుని పుస్తకం చదువుకుంటూ.. షాట్‌ రెడీ అనగానే- టక్కున లేచి టచప్‌ చేసుకొని వెళ్లే ఆర్టిస్టు.

ఇల్లు ఇవ్వమని అడిగాం:

ఇల్లు ఇవ్వమని అడిగాం:

అప్పుడప్పుడు ఫంక్షన్లలో కలవటం తప్ప ఆమెతో వేరే పరిచయం లేదు. గోరింటాకు సినిమా షూటింగ్‌కు పోయస్‌ గార్డెన్‌లో ఆమె ఇల్లయితే బావుంటుందన్నారు. జయలలితకు ఫోన్‌ చేశా. ‘‘ఇప్పటిదాకా ఎవరికీ షూటింగ్‌లకు ఇవ్వలేదు డైరక్టర్‌గారు..'' అంది ఆమె. నేను, నిర్మాత మురారీ కలిసి ఆమెను వ్యక్తిగతంగా కలిసి షూటింగ్‌కు ఇల్లు ఇవ్వమని అడిగాం.

కండీషన్‌ పెట్టారు:

కండీషన్‌ పెట్టారు:

జయలలిత సరే అంది. సరిగ్గా షూటింగ్‌ ప్రారంభమయ్యే ముందు.. ప్రొడక్షన్‌ వాళ్లు కంగారుపడుతూ నాకు ఫోన్‌ చేశారు. ‘‘సార్‌! మేడమ్‌ ఒక కండీషన్‌ పెట్టారు. ఎవరూ బయట భోజనాలు చేయడానికి వీల్లేదు. భోజనం ప్లేట్లుగానీ, కాఫీ కప్పులు గానీ బయట నుంచి లోపలకు రావడానికి వీల్లేదన్నారు'' అని చెప్పారు.

అందరికీ భోజనాలు:

అందరికీ భోజనాలు:

ఇల్లు పాడు చేస్తామనే ఉద్దేశంతో ఆమె అలా అందేమోననుకొని.. ‘‘రోడ్డు పక్కన టెంట్‌ వేయండయ్యా.. అందరం అక్కడే భోజనాలు చేద్దాం..'' అన్నా. ఆ మర్నాడు మా అందరికీ షాక్‌! మొత్తం యూనిట్‌ అందరికీ ఆమె భోజనాలు పెట్టించింది. బయట నుంచి భోజనాలు రాకూడదంటే.. ‘నా ఇంట్లో షూటింగ్‌ చేస్తూ.. మీరు బయట భోజనాలు చేయటమేమిట'ని ఆమె భావమని అప్పుడర్థమైంది.

హిందీ రీమేక్‌ను కూడా:

హిందీ రీమేక్‌ను కూడా:

ప్రతిరోజూ నేను, శోభన్‌బాబు, జయలలిత కలిసి భోజనం చేసేవాళ్లం. ఆ తర్వాత గోరింటాకు హిందీ రీమేక్‌ను కూడా అక్కడే తీశాం. ‘అభిమన్యుడు', ‘బహుదూరపు బాటసారి' సినిమాల్లో కొంత భాగం ఆ ఇంట్లోనే తీశాం. జయలలితకు పద్మ (దాసరి భార్య) అంటే చాలా ఇష్టం. ఆమెను చాలాసార్లు పోయె్‌సగార్డెన్‌కు పిలిచేది. ఇలా మా కుటుంబాల మధ్య మంచి అనుబంధమే ఉంది.

 హీరోయిన్‌గా:

హీరోయిన్‌గా:

‘కన్యాకుమారి' సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే అనుకున్నాం. మాకు కంటిన్యూగా 25 రోజులు డేట్స్‌ కూడా ఇచ్చింది. నాగార్జున సాగర్‌లో షూటింగ్‌ పెట్టుకున్నాం. మూడు రోజుల్లో షూటింగ్‌ మొదలవుతుందనగా ఎంజీఆర్‌ దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయనతో నాకు బాగా పరిచయముంది.

 మీరు హెల్ప్‌ చేయాలి:

మీరు హెల్ప్‌ చేయాలి:

‘‘దాసరి గారూ.. చిన్న ప్రాబ్లమ్‌ వచ్చింది. మీరు హెల్ప్‌ చేయాలి'' అన్నారు. చెప్పండి సార్‌ అన్నా. ‘‘మేము షూటింగ్‌ కోసం కశ్మీర్‌లో ఉన్నాం. వర్షాల కారణంగా 15 రోజులు షెడ్యూల్‌ పోయింది. మొత్తం యూనిట్‌ ఇక్కడే ఉంది. జయలలిత డేట్స్‌ మీకు ఇచ్చిందట. మీరు ఆ డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయండి..'' అన్నారు.

అడ్వాన్స్‌ డబ్బులు :

అడ్వాన్స్‌ డబ్బులు :

షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అంతేకాకుండా నాకు కూడా డేట్స్‌ ప్రాబ్లం ఉంది. ఆ విషయమే ఎంజీఆర్‌కి చెప్పా. ‘‘ఆమె బదులు ఇంకొకరిని తీసుకుంటా.. జయలలితతో తర్వాత ఇంకో సినిమా చేస్తా..'' అంటే ఆయన ఒప్పుకున్నారు. ఆ మర్నాడు జయలలిత తను తీసుకున్న అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి పంపేసింది.

బెస్ట్‌ డైరక్టర్‌ ఆఫ్‌ ఇండియా:

బెస్ట్‌ డైరక్టర్‌ ఆఫ్‌ ఇండియా:

‘‘నేను ఇంకో సినిమా చేస్తానన్నాగా.. దానికి ఈ అడ్వాన్స్‌ ఉంచండి..'' అని తిప్పి పంపేశా. దానితో ఆమెకు నేనంటే చాలా గౌరవం ఏర్పడింది. చెన్నైలో ఎంజీఆర్‌ పేరిట కట్టించిన స్టూడియో ప్రారంభోత్సవానికి నన్ను పిలిచి చాలా సత్కరించింది. శివాజీ గణేశన్‌, కమలహాసన్‌, రజనీకాంత్, బాలచందర్‌ ఇలాంటి మహామహులు మొదటి వరసలో కూర్చుంటే.. నేను, శరవణ్‌గారు, జయలలిత స్టేజీ మీద కూర్చున్నాం. ఆ కార్యక్రమంలో నాకు బెస్ట్‌ డైరక్టర్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు.. శరవణ్‌గారికి బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు ఇచ్చి సత్కరించింది.

మన వాళ్లు భయపడతారు:

మన వాళ్లు భయపడతారు:

ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని నెగటివ్‌ పాయింట్స్‌ ఉంటాయి. దాంతో బయోపిక్స్‌ను తీయటానికి మన వాళ్లు భయపడతారు. కొన్ని సార్లు బయోపిక్‌లకు ఆదరణ కూడా లభించటం లేదు. ఉదాహరణకు కొందరు రఘుపతి వెంకయ్యగారి బయోపిక్‌ తీశారు. అది నాకు నచ్చింది. కొన్నా. కానీ ఈ రోజు వరకూ నేను దాన్ని రిలీజ్‌ చేయలేకపోయా.

నా బయోపిక్‌ నేనే తీస్తా:

నా బయోపిక్‌ నేనే తీస్తా:

కనీసం శాటిలైట్‌ రైట్స్‌ కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. బయోపిక్స్‌పై మనకున్న గౌరవం అలాంటిది.. నా బయోపిక్‌ను కూడా తీస్తామని ఎవరో వచ్చారు. కానీ తీయటం చాలా కష్టమని చెప్పా. ఒకవేళ తీసినా ఒక భాగం చాలదు. రెండు భాగాలుండాలి. నా జీవితం తొమ్మిదో ఏట నుంచి ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఏదో ఒక మెరుపో, మెలికో, మలుపో ఉంటుంది. ఎప్పుడైనా నా బయోపిక్‌ నేనే తీస్తా. అంటూ చెప్పిన దాసరి ఆయన రాయబోయే పుస్తకం తో చాలా మంది గుండేల్లో రైళ్ళు పరిగెత్తించేలానే ఉన్నారు.

English summary
Telugu filmmaker Dasari Narayana Rao is planning to direct a biopic on former chief minister of Tamil Nadu late Jayalalitha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu