»   » స్టార్స్‌కి కథలు చెప్పడం నాతో జరిగేది కాదు....దాసరి

స్టార్స్‌కి కథలు చెప్పడం నాతో జరిగేది కాదు....దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజానికి ఓ మెట్టు పైనే ఉన్నా...ఐయామ్ ఆల్వేస్ అప్ టు డేట్...ఇంత గ్యాప్ తర్వాత తీసినందుకు 'దాసరి గారు చెయ్యాల్సిన సినిమాయే చేశారు' అని అందరూ ఖచ్చితంగా చెప్తారు" అంటున్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. ఈ రోజు (మే 4) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...తాజా చిత్రం 'యంగ్ ఇండియా' గురించి ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆరేళ్లలో ఏ సినిమా కూడా చూడకుండా మిస్సవలేదు, చిన్నది కానీ పెద్దది కానీ. 'సింహా'తో సహా ఇప్పుడు మార్కెట్లో ఉన్న 'డార్లింగ్', 'ఏ మాయ చేసావె', 'బిందాస్' సినిమాలు కూడా చూశానన్నారు. అలాగే ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత..చేస్తే 'బొబ్బిలి పులి' లాంటి సెన్సేషనల్ సినిమా లేదా 'స్వర్గం నరకం' లాగా కొత్తవాళ్లతో చెయ్యాలి. మధ్యస్థంగా చెయ్యడం నేనున్న స్టేజ్‌కి కరెక్ట్ కాదు.

హైలో చెయ్యాలంటే స్టార్స్‌కి కథలు చెప్పడం నాతో జరిగేది కాదు. అందుకే కొత్తవాళ్లతో వెళ్దామని వాళ్లని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు తయారుచేశా. హీరో, విలన్ అంటూ నిర్దేశింపబడ్డ స్క్రిప్టు కాదు ఇది. మొత్తం 81 పాత్రలు. అన్ని పాత్రలకీ కొత్తవాళ్లనే తీసుకున్నా. ఒక టీచర్, స్టూడెంట్స్ అనుబంధంతో వాళ్లతో చేశానన్నారు. 'యంగ్ ఇండియా' లో సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత కొత్తవాళ్ల సినిమా చూస్తున్నామనే సంగతి అంతా మర్చిపోతారు అని ధీమా వ్యక్తం చేసారు. దాసరి పద్మ సమర్పణలో సౌభాగ్య మీడియా పతాకంపై కె రామకృష్ణప్రసాద్ 'యంగ్ ఇండియా' నిర్మించారు. దాసిరి ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుంటూ మరెన్నో చిత్రాలు రూపొందించాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu