»   » పవన్ కళ్యాణ్ తో సినిమాచేయాలనే దాసరి కోరిక తీరనేలేదు

పవన్ కళ్యాణ్ తో సినిమాచేయాలనే దాసరి కోరిక తీరనేలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో సినిమా రావాలనే కోరిక అభిమానులకు తీరలేదు. అయితే పవన్ తో సినిమాను నిర్మించాలని దాసరి నిర్ణయించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకరత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో సినిమా తీయాలని నిర్ణయించారు. వీరిద్దరూ స్వయంగానే ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్ కు తగ్గ కథ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు.

కథ కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ తారకప్రభు ఫిలింస్ బ్యానర్ లో 38వ, సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడ ఇచ్చారు.

dasari narayana rao

దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు బోస్ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా పెరిగింది.

పవన్, దాసరికి రాజకీయ నేపథ్యం కూడ ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాజబోయే సినిమా కూడ ఈ అంశాలను ప్రతిబింబించేలా ఉంటుందనే ప్రచారం ఉంది.ఖైదీ 150 చిత్రం సందర్భంగా కూడ ప్రస్తావించారు. అయితే అంతలోనే దాసరి అనారోగ్యానికి గురికావడం తర్వాత ఆయన కోలుకొన్నారు.

English summary
Telugu cine director Dasari Narayana Rao decided to make a film with pawankalyan, He announced Bose cinema with Pawan . Dasari dead on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu