twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్ స్టోరీ: అనారోగ్యానికి ముందే దాసరి కృంగిపోయారు, కారణం ఆవిడే..!

    దాసరి అనారోగ్యానికి గురవడానికి ముందే మానసికంగా చాలా కృంగి పోయారు. అందుకు కారణం తనలో సగమైన, తన భార్య పద్మ తనకంటే ముందే ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోవడమే.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దాసరి అనారోగ్యానికి గురవడానికి ముందే మానసికంగా చాలా కృంగి పోయారు. అందుకు కారణం తనలో సగమైన, తన భార్య పద్మ తనకంటే ముందే ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోవడమే. ఆ బాధలోనే దాసరి అనారోగ్యానికి గురయ్యారని, ఇపుడు అందరినీ విడిచి తన పద్మ వద్దకు వెళ్లిపోయాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

    దాసరి నారాయణ రావు ఇంత పెద్దర్శకుడిగా ఎదగడంలో పద్మ పాత్ర ఎంతో ఉందని, అసలు పద్మ లాంటి భార్య ఆయనకు దొరికి ఉండక పోతే దాసరి పరిస్థితి మరోలా ఉండేదేమో అనే వారు ఉన్నారు. అన్నీ తానై తనను ముందుకు నడిపించిన పద్మ 2011, అక్టోబర్ 28 మరణించడంతో దాసరి మనోధైర్యం కోల్పోయారు.

    ఎవరి వల్లా కాలేదు

    ఎవరి వల్లా కాలేదు

    పద్మ మరణించినపుడు దాసరి చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అప్పటివరకు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన జీవిత భాగస్వామి తనను శాశ్వతంగా వదిలిపోవడంతో దాసరి తట్టుకోలేక పోయారు.

    ప్రేమ వివాహం

    ప్రేమ వివాహం

    దాసరి నారాయణ రావు, పద్మలది ప్రేమ వివాహం. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ ప్రాంతంలో వీరి ప్రేమకు బీజం పడింది. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి తర్వాత పెళ్లి చేసుకున్నారు. దాసరి ఈ స్థాయికి రావడానికి పద్మ కృషి ఎంతో ఉందని అంటుంటారంతా.

    నాటకాలే వీరిని కలిపాయి

    నాటకాలే వీరిని కలిపాయి

    సినిమాల్లోకి రాక ముందు దాసరి హైదరాబాద్ లో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసారు. ఉద్యోగం చేస్తూనే నాటకరంగంపై ఉన్న మక్కువతో నాటకాలు వేసేవారు. రవీంద్రభారతి, గాంధీభవన్, త్యాగరాయగాన సభల్లో వందలాది నాటకాలు వేసారు. ఈ నాటకాలే దాసరి నారాయణ రావు, పద్మ పరిచయానికి కారణం అయ్యాయి.

    తొలిసారి ఇద్దరూ కలిసిన సందర్భం

    తొలిసారి ఇద్దరూ కలిసిన సందర్భం

    ఓ సారి దాసరి నారాయణ రావు తన సొంతూరు పాలకొల్లు వెలుతూ చెల్లికి గాజులు కొందామని పాతబస్తీలోని సుల్తాన్ బజార్ వెళ్లారు . షాపు వాడు ఏ సైజు గాజులు కావాలి? అని ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తెలియక పక్కనే నిల్చుని ఉన్న ఓ అమ్మాయి చేయి చూపి ఈ సైజు కావాలి అని చెప్పాడట. ఆ అమ్మాయే పద్మ.

    ఇద్దరి అభిరుచులు ఒక్కటే

    ఇద్దరి అభిరుచులు ఒక్కటే

    దాసరి నారాయణ రావును నాటకాల్లో చూసిన పద్మ.... మీరు నాటకాలు వేస్తారు కదా అని అడిగిందట. పద్మకు కూడా నాటకాలంటే ఇష్టం. అలా ఇద్దరి మధ్య మాటలు కలవడం, ఇద్దరి అభిరుచులు కూడా ఒకటే కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది, ఆపై పెళ్లి చేసుకున్నారు.

    పద్మ అండతో దాసరి విజృంభన

    పద్మ అండతో దాసరి విజృంభన

    పద్మతో పెళ్లయిన తర్వాత దాసరి సినీ రంగంలో విజృంభించారు. కొన్ని సందర్భాల్లో రోజూ నాలుగైదు షిప్టుల్లో పని చేస్తూ.... ఒకేసారి నాలుగుగైదు సినిమాలకు దర్శకత్వం వహించారు. తన వ్యవహారాలన్నీ పద్మ దగ్గరుండి చూసుకునేది. పద్మ సపోర్టు ఉండబట్టే దాసరి ఎలాంటి టెన్షన్స్ లేకుండా తన సినిమా కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు.

    English summary
    One of the greatest figures in Telugu cinema, veteran director, actor, producer, lyricist and dialogue writer Dasari Narayana Rao is no more. His wife, Dasari Padma, died in October 2011. The cremation will be held at the family’s farmhouse in Chevella, near Moindabad, on Wednesday evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X