హాట్ టాపిక్ : 3D లో భారీగా 'కురుక్షేత్రం'

దాసరి మాట్లాడుతూ...''మహాభారతంలోని కురుక్షేత్ర సమరాన్ని తెరకెక్కించాలనేది నా కల. సాధ్యమైనంత త్వరలోనే ఆ కలను సాకారం చేసుకుంటాను. అయిదు భాగాలుగా ఈ కథను తీర్చిదిద్దుతాను. అంతేకాక, అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రీడీలో ఈ అయిదు భాగాలనూ నిర్మించాలనేది నా అకాంక్ష'' అని తెలిపారు.
అలాగే 'భారతాన్ని తీయడం సాధారణమైన విషయం కాదు. తీసే సత్తా ఉన్నా... ఆ పాత్రలను రక్తికట్టించే పాత్రధారులు ఇప్పుడు లేరు అందుకే జాతీయ స్థాయిలో తారలను ఎంపిక చేస్తాం. ఆంగికం, ఆహార్యం, వాచకం... ఇలా అన్ని విషయాల్లోనూ సమర్థులనదగ్గవారిని ఎంచుకొని ఈ కావ్యాన్ని తీస్తాను. చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఈ అయిదు భాగాలు ఉంటాయి'' అని తెలియచేశారు దాసరి.
ఇక ''దర్శకునిగా నాకిది మరో ప్రస్థానం. అందుకే శారీరకంగా, మానసికంగా కూడా సన్నద్ధమవుతున్నాను. దర్శకునిగా నా కలలను, ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే దృఢ నిశ్చయంతో, కసితో 19 కిలోలు బరువు తగ్గాను. నా సత్తా ఏంటో త్వరలోనే చూస్తారు'' అన్నారు దాసరి.


Click it and Unblock the Notifications