»   » దర్శక దిగ్గజం దాసరి ఇకలేరు..గుండెపోటుతో మృతి..

దర్శక దిగ్గజం దాసరి ఇకలేరు..గుండెపోటుతో మృతి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూశారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి మంగళవారం తుదిశ్వాస విడిచారు. దాసరి మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది.

పత్రిక అధినేతగా దాసరి

పత్రిక అధినేతగా దాసరి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4వ తేదీన జన్మించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. దాసరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉదయం పత్రికను స్థాపించి పత్రికారంగంలో సంచలనం సృష్టించారు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. గుండెపోటు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. గుండెపోటు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు అని వైద్యులు మీడియాకు తెలిపారు.

151 చిత్రాలకు దర్శకత్వం..

151 చిత్రాలకు దర్శకత్వం..

టాలీవుడ్‌లో దాసరి 151 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 250 చిత్రాలకు మాటల రచయితగా వ్యవహరించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో నటులను, దర్శకులను పరిచయం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను గిన్నిస్ బుక్ రికార్డుకు చేర్చిన ఘనత దాసరికే దక్కింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో ఆయన నటించారు.

పెద్ద దిక్కు కోల్పోయిన టాలీవుడ్

పెద్ద దిక్కు కోల్పోయిన టాలీవుడ్

తారక ప్రభు ఫిలింస్‌ను స్థాపించి 53 చిత్రాలను నిర్మించారు. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులను, పలు ఇతర అవార్డులను సొంతం చేసుకొన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించడంలో దాసరిది ప్రత్యేకమైన శైలి. దాసరిగారు ఇకలేరు అంటూ నిర్మాత చిల్లర కల్యాణ్ కన్నీరుమున్నీరయ్యాడు. దాసరి మృతితో చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయింది అని పీఆర్వో ప్రభు రోదించాడు.

English summary
Dasari Narayana Rao no more
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu