twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈడీ ఆస్తుల జప్తుపై దాసరి స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు వాటాదారుగా ఉన్న సౌభాగ్య మీడియా లిమిటెడ్‌కు చెందిన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (దిల్లీ) ఉత్తర్వులు జారీ చేసింది. జప్తు చేసిన వాటిలో సౌభాగ్య మీడియాకు చెందిన ఓ నివాస భవనం, రూ.50 లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, ఖరీదైన రెండు కార్లు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయని వార్తా సంస్థ పీటీఐ తన కథనంలో పేర్కొంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ విషయమై దాసరి మాట్లాడుతూ... సౌభాగ్య మీడియాలో తాను వాటాదారు మాత్రమేనని స్పష్టం చేశారు. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సౌభాగ్య మీడియా లిమిటెడ్‌ లిస్టెడ్‌ కంపెనీ అని, ఆ కంపెనీ వాటాల ట్రేడింగ్‌ జరుగుతోందని తెలిపారు. ఈడీ ఆస్తుల జప్తునకు సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని, తన సొంత ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని దాసరి స్పష్టం చేశారు. ఈడీ జప్తు ఉత్తర్వులు ఇచ్చినట్లయితే అవి తాను వాటాదారుగా ఉన్న సౌభాగ్య మీడియాకు చెందిన ఆస్తులవేనని మీడియాకు తెలిపారు.

    Dasari Narayana Rao on ED attach

    మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో దాసరి నారాయణరావు కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నపుడు బొగ్గు గనుల కేటాయింపులో జిందాల్‌ కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వెలువరించారని, అందువల్ల సౌభాగ్య మీడియాకు జిందాల్‌-న్యూదిల్లీ ఎగ్జిమ్‌ కంపెనీ రూ.2.25 కోట్ల నిధులను మళ్లించిందని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. దీని ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

    ఈ కేసులో అప్పటి మంత్రి దాసరి నారాయణరావు, ఎంపీ నవీన్‌ జిందాల్‌, గగన్‌ స్పాంజ్‌ ఐరన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌, జిందాల్‌ రియల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సౌభాగ్య మీడియా లిమిటెడ్‌లను నిందితులుగా చేర్చి దర్యాప్తు చేపట్టింది. బొగ్గు గనుల కేటాయింపులో జిందాల్‌ కంపెనీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకుగాను అప్పటి మంత్రి అయిన దాసరి నారాయణరావుకు చెందిన సౌభాగ్య మీడియాలోకి జిందాల్‌ నుంచి వచ్చినవి ముడుపుల సొమ్మేనని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.

    ఇక దాసరి నారాయణ రావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ రంగం సిద్ధం చేసినట్లుగా వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఆయాచిత లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్‌ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్‌ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది.

    సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రానికి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. గతంలో దాసరిని సీబీఐ హైదరాబాదులో ప్రశ్నించింది. అదే సమయంలో మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించింది.

    హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని దాసరి నారాయణ రావు సీబీఐకి గతంలో వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్‌గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు. స్క్రీనింగ్ కమిటీ తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు తలబిరా-2 బొగ్గు బ్లాకుల్ని కేటాయించిందని, తాను అదే నిర్ణయాన్ని సమర్థించానని దాసరి తెలిపారు.

    స్క్రీనింగ్ కమిటీలో వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారని, వారి నిర్ణయమే అంతిమమన్నారు. బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం లేదని, నలభై మందితో కూడిన కమిటీ ఓకే చేశాకనే తాను ఫైల్స్ పైన సంతకం చేశానని, తాను నిరపరాధిగా తేలుతానని గతంలో జరిగిన విచారణలో దాసరి చెప్పారు.

    English summary
    Film maker and director Dasari Narayana Rao, former minister of state for coal received shock when Enforcement Directorate (ED) attached properties worth Rs 2 crs belonging to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X