»   » దాసరి నారాయణ రావుకి 'పద్మ భూషణ్'..మళ్ళీ వివాదం!?

దాసరి నారాయణ రావుకి 'పద్మ భూషణ్'..మళ్ళీ వివాదం!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీ నటుడు,దర్శకుడు దాసరి నారాయణ రావు పేరును పద్మభూషణ్ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిపార్స్ చేసింది. సినీ,సాంస్కృతిక రంగాలతో పాటు విద్య, సాహిత్యం, వైద్య రంగాల్లో నిష్టాణుతులైన నలభై మంది పేర్లను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ కోసం ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రానికి సిపార్స్ చేసారు. అలాగే తెలుగు చలన చిత్ర రంగం నుంచి బాపు, ముళ్ళపూడి వెంకట రమణ లను, సినీ రంగానికి చేసిన సేవలకు గానూ రామానాయుడుకి పద్మశ్రీ అవార్డులకు ప్రతిపాదించారు. ఇక ఇటీవలే దాసరికి ఉత్తమ నటుడుగా ప్రభుత్వ నంది అవార్డు రావటం, దీనిపై పలు వివాదాలు వెల్లు వెత్తడం తెలిసిందే. దాంతో ఈ విషయం మరో సారి చర్చల్లో నిలవనుంది. రెండు రోజుల క్రితం చిరంజీవి కూడా ఆరెంజ్ అవార్డుల పంక్షన్ లో అవార్డులు వాటంతట అవే రావాలంటూ...దాసరి పై వ్యంగ్య బాణాలు ఎక్కుపెట్టారు. దాంతో ఈ అవార్డు విషయమై ఎటువంటి విమర్శలు వెల్లువెత్తుతాయనేది అందరిలోనూ కలుగుతున్న పెద్ద ప్రశ్న.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu