»   » రవితేజ ‘బలుపు’పై... దాసరి కామెంట్

రవితేజ ‘బలుపు’పై... దాసరి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పివిపి సినిమా పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'బలుపు'. ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 28న విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది.

ప్రసాద్ వి.పొట్లూరి తమ బేనర్లో నిర్మించిన తొలి తెలుగు చిత్రంతోనే సక్సెస్ సాధించడం గమనార్హం. మరో వైపు బలుపు చిత్రం రవితేజ కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలించిది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకరత్న దాసరి నారాయణ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.

సినిమా చూసిన అనంతరం దాసరి నారాయణరావు మాట్లాడుతూ...''ఈ మధ్య కాలంలో నేను చూసిన ఫుల్ మాస్, ఎంటర్టెనర్ 'బలుపు'. రెండున్నర గంటలు నవ్విస్తూనే ఉంది. టీమ్ అంతా చాలా కష్టపడి చేసారు. డైరెక్టర్ గోపీచంద్ కథ కటే కథనం, ట్రీట్‌మెంట్ విషయాల్లో కేర్ తీసుకుని అద్భుతంగా చేసాడు. చాలా రోజుల తర్వాత రవితేజ చాలా ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మ్ చేసిన సినిమా ఇది. తన స్టామినా ఏంటో ఈ చిత్రంతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

బ్రహ్మానందం సినిమాకి జీవం పోసాడు. శృతి హాసన్ చేసిన మూవీస్ అన్నింటికంటే ఈ సినిమాలో చాలా హుషారుగా తన క్యారెక్టర్‌ని చేసింది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా డిజైన్ చేసాడు దర్శకుడు. సినిమా రిలీజ్ అయినపుడు బాగానే ఉందన్నారు. ఇప్పుడు చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు.

నాకైతే రవితేజ సినిమాలన్నింటికంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనిపిస్తోంది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైమ్ పివిపి బేనర్లో తీసిన తెలుగు సినిమా 'బలుపు' పెద్ద హిట్ అయింది. ఇలాగే మరిన్ని సినిమాలు చేసి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

English summary
Director Dasari Narayana Rao is a hard man to please. But he seems to be very impressed with Mass Maharaja Ravi Teja. Dasari Narayana Rao Praised that Balupu is good entertainment movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu