»   »  దాసరి కోలుకొంటున్నారు.. మోహన్ బాబు

దాసరి కోలుకొంటున్నారు.. మోహన్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకరత్న దాసరి నారాయణరావు కోలుకొంటున్నారని నటుడు మోహన్ బాబు మీడియాకు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని కిమ్స్ దవాఖానలో చేరిన దాసరిని మోహన్ బాబు, జయసుధ తదితరులు మంగళవారం మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ .. దాసరి ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉందని తెలిపారు.

Mohan Babu

కాగా, దాసరి ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ హాస్పిటల్ వర్గాలు మధ్యాహ్నం బులెటిన్ ను విడుదల చేశారు. 'దాసరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నాం. ఇన్ ఫెక్షన్ ను తొలగించేందుకు ఛాతీ ఆపరేషన్ చేయనున్నాం. ఆపరేషన్ తర్వాత మరో బులెటిన్ ను విడుదల చేస్తాం. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు' అని బులెటిన్ లో పేర్కొన్నారు.

English summary
Famous Director Dasari Narayana Rao joined in KIMS hospital due to serious health complications. KIMS released Health bulletin on his health situation
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu