»   » దాసరి మరణంపై అనుమానాలు, ఆస్తిలో వాటాలు: పెద్ద కోడలు సంచలనం!

దాసరి మరణంపై అనుమానాలు, ఆస్తిలో వాటాలు: పెద్ద కోడలు సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిన వేళ దాసరి నారాయణ రావు పెద్ద కడలు సుశీల సంచలన కామెంట్స్ చేసారు. మామగారు దాసరి నారాయణరావు మరణంపై అనుమానాలున్నాయంటూ బాంబు పేల్చింది.

ఈ అనుమానాలతో పాటు.... ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తికాకముందే ఆస్తుల్లో వాటా విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించడం చర్చనీయాశం అయింది. ఇంకా దాసరి చితి కూడా అంటుకోక ముందే సుశీల ప్రవర్తన అందరినీ విస్మయానికి గురి చేసింది.

దాసరి మరణంపై అనుమానాలు

దాసరి మరణంపై అనుమానాలు

లాస్ట్ టైం మామగారు ఆసుపత్రిలో ఉన్నపుడే చాలా మంది అనుమానం వ్యక్తం చేసారు. అంత ఆరోగ్యమైన మనిషి హఠాత్తుగా ఇలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేసారని.... ఇంతలోనే ఆయన మరణించడంపై తనకు చాలా అనుమానాలున్నాయని సుశీల ఆరోపించారు.

కుటుంబంలో ప్రాబ్లమ్స్

కుటుంబంలో ప్రాబ్లమ్స్

కుటుంబంలో కొన్ని ప్రాబ్ల్స్ ఉన్నాయి. కానీ నాకూ నా భర్తకు విడాకులు అయితే అవ్వలేదు అని సుశీల అన్నారు.

మామగారిని కలిసాను

మామగారిని కలిసాను

లాస్ట్ టైమ్ కూడా నేనొచ్చాను. నన్ను లోనికి వెళ్లనివ్వలేదు. అందుకే నాకు కొన్ని అనుమానాలున్నాయి. మే 4న మామగారి దగ్గరకు వెళ్లాను. మామగారు మంచిగా మాట్లాడారు అని సుశీల తెలిపారు.

మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానన్నారు

మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానన్నారు

మాస్టర్ దాసరి నారాయణ రావును సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని మనవడు అడిగాడు. తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, రెండు వారాల తర్వాత రండి కూర్చుని మాట్లాడుకుందామన్నారు అని సుశీల తెలిపారు.

మాకు న్యాయం చేస్తామన్నారు

మాకు న్యాయం చేస్తామన్నారు

మాకు కూడా ఆస్తిలో భాగం ఏమీ ఇవ్వలేదండీ... రెండు వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా , ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన నేను మీకు అన్యాయం చేయను. నా మనవడిని నేను దగ్గరికి తీసుకుంటాను అన్నారు. అంతలోనే ఇలా జరిగింది. దాసరిగారి మరణం మీద నాకు అనుమానాలున్నాయి అని సుశీల ఆరోపించారు.

English summary
Dasari Narayana Rao's Daughter In Law Shocking Comments On Dasari death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu