»   » ఇంకో సారి ఇలా జరిగితే వెళ్లిపోతాను,: వేదిక మీదే దాసరి సీరియస్ వార్నింగ్

ఇంకో సారి ఇలా జరిగితే వెళ్లిపోతాను,: వేదిక మీదే దాసరి సీరియస్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోంది. పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారు" టాలీవుడ్ లో ఇంత నిర్మొహ మాటంగా నిక్కచ్చిగా మాట్లాడే మనిషి ఒక్కరే ఒక్కరు. దర్శక రత్న దాసరి నారాయణ రావు మాత్రమే. ఆయనకు నచ్చైని విషయాన్ని నిర్మొహమాటంగా ఎదుట ఉన్నది ఎవరూ అని కూడా చూడకుండా చెప్పేస్తారాయన. ఒక సంధర్భం లో తెలుగు సినిమాల మీదనే కాదు తెలుగు చానెళ్ళలో వచ్చే డబ్బింగ్ సీరియళ్ళ మీద కూడా తన అసహనాన్ని పేరర్శించారు. తెలుగు పరిశ్రమల్లో తెలుగు వాళ్ళే కనిపించక పోవటం... అంతా ఇంగ్లీష్ లో నే మాట్లాడటానికి ప్రయత్నించతమ్న్ ఆయనకు నచ్చని విషయం అని బాహటంగానే అన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో అచ్చతెలుగువాడిగా పంచెకట్టుకుని వచ్చిన చిరంజీవి తెలుగు భాష అన్నా, తెలుగువాళ్లన్నా మహా ప్రాణమన్నారు. తెలుగువారికి సంబంధించిన ఏ విషయన్నయినా ఒక అడుగు ముందుండి వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు.

మా టీవీలో డబ్బింగ్ సీరియళ్ల దాడితో ఇక్కడి తెలుగువారికి అవకాశాలు కోల్పోతున్నాయని తెలుగు టీవీ ఆర్టిస్టులు దాసరి దృష్టికి తీసుకెళ్లినప్పుడు దాసరి మాట్లాడుతూ... చిరంజీవి కోసం చాలాసార్లు వెళ్లారా... కేంద్రమంత్రి గదా... చాలా బిజిగా ఉంటారులే. మీరు మళ్లీ ఆయన అపాయింట్మెంట్ కోసం తిరగండి. ఎలాగయినా ఆయనను కలవండి. కలిసి విషయం చెప్పండి. తప్పకుండా మీరు చెప్పినవి విని మా టీవీలో ప్రసారమవుతున్న అన్ని డబ్బింగ్ సీరియళ్లును ఒక్క దెబ్బతో తీసిపారేస్తారు.

Dasari Narayana Rao Serious about Telugu actors speech in English

తెలుగు భాష అన్నా, తెలుగువాళ్లన్నా చిరంజీవికి ఎనలేని అభిమానం. నాకు తెలిసి ఇంతవరకూ ఈ సమస్య ఆయన దృష్టికి రాలేదనుకుంటా. వచ్చివుంటే ఎప్పుడో నిర్ణయం తీసుకునేవారు" అంటూ చిరంజీవి మీద వేసిన సెతర్ దగ్గర్నుంచీ పలు సార్లు వేదిక మీదనే తెలుగు సినీ పర్శ్రమలో తెలుగు మాట్లాడని నటులు ఎక్కువగా అయిపోవటం పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇంకో బాంబు పేల్చి ఇండైరెక్ట్ గా చాలా మందికే చురకలంటించాడు. అయితే ఈ దెబ్బ పరభాషా హీరోయిన్లకంటే తెలుగు వాళ్ళే అయిఉండి కూడా ఇంగ్లీష్ లో మాట్లాడే మన యువస్టార్లకే ఈ దెబ్బ బలంగా తగిలేటట్టుంది... ఇంతకీ సంగతేమిటంటే...

ఈ మధ్యనే ఓ సినిమా ఫంక్షన్‌కి హాజరైన దాసరి నారాయణరావు, నెక్స్‌ట్‌ టైమ్‌ తాను అదే సినిమా కార్యక్రమానికి హాజరయ్యేనాటికి హీరోయిన్లు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలనీ, లేదంటే ఆ కార్యక్రమం నుంచి నిర్మొహ మాటంగా వాకౌట్‌ చేస్తానని ఆ విషయం లో ఎవరు భాదపడ్దా, తన గురించి చెడుగా అనుకున్నా పట్టించుకోననీ హెచ్చరించారు. తెలుగు సినీ పరిశ్రమ పలు ఇతర భాషలకు చెందిన నటీనటుల్ని ఆదరిస్తోందనీ, అయినా వారు తెలుగు నేర్చుకోవడానికి అయిష్టత ప్రదర్శిస్తున్నారనీ, తెలుగు నటీనటులు కూడా తెలుగు మర్చిపోతున్నారనీ, తెలుగు సినీ పరిశ్రమను ఇంగ్లీషు సినీ పరిశ్రమలా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దాసరి నారాయణరావు.

అయితే దాసరి ఆవేదనలో నిజం ఉన్నా... కేవలం పరభాషా నటుల సంగతి పక్కన పెడితే... మన వాళ్ళే అయిఉండి కూదా తెలుగులో మాట్లాడకుందా.., ఓ..! ఇంగ్లీష్ లో మాట్లాడేసే కుర్ర హీరోలకే ఈ పంచ్ ముందుగా తగలాల్సింది. ఎందుకంటే... చాలామంది హీరోయిన్లు తెలుగు నేర్చుకుంటున్నారు. పరభాషా నటులు కూడా తెలుగు మీద శ్రద్ధ చూపిస్తున్నారు. చార్మీ తాను తెలుగు నేర్చుకోవటమే కాదు కాజల్ కి డబ్బింగ్ కూదా చెప్పింది. నిత్యామీనన్‌ అయితే తెలుగులో పాటలు కూడా పాడేస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సమంత స్పష్టంగా తెలుగులోనే మాట్లాడుతున్నారు. అనుష్క సంగతి సరే సరి. కొత్త హీరోయిన్లు చాలావరకు మొదటి సినిమా పూర్తయ్యేసరికే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండడం అభినందనీయమే. మరి దాసరి హెచ్చరికని నిజంగా తీసుకోవాల్సింది ఎవరో కాస్త అర్థం చేసుకుంటే బావుండు....

English summary
Telugu Senior Director Dasari Narayana Rao serious about... English speech of telugu heros and heroines on Movie functions
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu