»   » మైక్ దొరికింది కదా అని వితండవాదం వినిపించిన దాసరి నారాయణ రావు!

మైక్ దొరికింది కదా అని వితండవాదం వినిపించిన దాసరి నారాయణ రావు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా రూపొందే చిత్రం' మా అన్నయ్య బంగారం" ప్రారంబోత్సవానికి విచ్చేసి అతిరధ మహారధులలో ఒక్కరైన దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రారంభ అనంతరం ఉద్రేకంతో పెద్ద నిర్మాతలపై చిందులు తొక్కారు. ఈ మధ్య హీరో రాజా దాసరి పేరు చెప్పకుండా నలుగురు నిర్మాతల పేర్లు చెప్పి చిన్న సినిమాలను దోచుకుంటున్నారనీ ఆరోపణలు చేసిన క్రమంలో అతనికి మించి ఈ నలుగురు నిర్మాతలపై దాసరి ఈ సంచలన వ్యాఖ్యలు చేయటం అందరికీ ఆర్చర్యంతో పాటు హాస్యాస్పదాన్ని కలిగించింది.

కేవలం మూడు నాలగు కుటుంబాల్లో చిత్రపరిశ్రమ చిక్కుకుందని ప్రముఖ దర్శకుడు దాసరినారాయణరావు అన్నారు. సినీ పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం సాగుతోందని..మొత్తం సినిమా ఇండస్ట్రీని తమ చేతుల్లో బందీగా ఉంచుకున్నారనీ ఇటువంటి రోజులు పోయే రోజు దగ్గరలోనే ఉందని చెప్పడంతో పాటు తర్వరలో ఆ నలుగురి చేతులోనుండి చిత్ర పరిశ్రమను కాపాడతానని అందరికి అందేలా చేస్తానని దర్శకరత్న దాసరి నారాయణ రావు మైక్ దొరికింది కదా అని వితండవాదం వినిపించాడు.

ఆయన మాటలు విన్నవారు, ఆ నలుగురు కాదయ్యా..చేతిలో పలు నిర్మాణ సంస్థలు ఉంచుకొని, సిరీ మీడియా పేరిట భారీ డిస్ట్రీబ్యూషన్ సంస్థను ఏర్సాటు చేసి ఇటు వెండితెరను అటు బుల్లితెరను దోచుకుంటున్నది..అసలు ముందు చిన్న సినమాలకు జీవితం లేకుండా చేసింది నీవే అనే సంగతి మరిచి మతి తప్పి మాట్లాడుతున్నాడనీ ఆయన పై జోకులేసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu