»   » దాసరి నారాయణరావు వర్సెస్ రామ్ గోపాల్ వర్మ....

దాసరి నారాయణరావు వర్సెస్ రామ్ గోపాల్ వర్మ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువరత్న నందమూరి బాలకృష్ణ, దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో వస్తున్న 'పరమవీరచక్ర" మరియు రామ్ గోపాల్ వర్మ, సునీల్ కాంబినేషన్ లో వస్తున్న 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు" చిత్రం .." ఈ రెండు చిత్రాలు ఒకదానికొకటి పోటిపడటానికి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్దం అవుతున్నాయి. 'సింహా" చిత్రం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న 'పరమవీరచక్ర" చిత్రానికి హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. ఈ చిత్రాన్ని దాసరి డైరెక్టర్ చేయడం మరో విశేషం. 'మర్యాదరామన్న" చిత్రంతో హిట్ కొట్టిన సునీల్ ఇప్పుడు 'అప్పల్రాజు" చిత్రంలో నటిస్తుండటం, దీనికి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కి క్రేజ్ ఏర్పడింది.

'పరమవీర చక్ర" చిత్రంలోని పాటలు డిసెంబర్29 విడుదలవున్నాయి. కానీ 'అప్పల్రాజు" చిత్రంలోని పాటు వారికొకటి రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు వర్మ. సినీపరిశ్రమలోని కొంతమంది వ్యక్తులను, మీడియాలోని కొంతమంది పాత్రలను 'అప్పల్రాజు"లో పొందుపరచ్చి వారిపై పూర్తిగా సెటైర్ వేస్తున్నాడు. దాంతో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయినదగ్గర నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా?ఎప్పుడ చూద్దామా? అనే ఆతృత అందరిలో కలుగుతోంది. ఏదేమైనా..బాలకృష్ణ దాసరి వర్సెస్ సునీల్-వర్మ ఫైట్ లో ఎవరు నెగ్గుతారో ప్రేక్షకులే నిర్ణయించాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu