»   » దర్శకేంద్రుడు రాఘవేంద్ర తో పోటికి తలపడనున్న దర్శకరత్న దాసరి!??

దర్శకేంద్రుడు రాఘవేంద్ర తో పోటికి తలపడనున్న దర్శకరత్న దాసరి!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోలుగా ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ ఎలాగో..దర్శకులుగా కె. రాఘవేంద్రరావు, దాసరి అలా అన్నమాట వీరిద్దరి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఎన్టీఆర్ కు రాఘవేంద్రరావు 'అడవిరాముడు" వంటి హిట్ ఇస్తే..దాసరి 'సర్ధార్ పాపారాయుడు"ఇచ్చారు. ఆయన జస్టిస్ చౌదరి ఇస్తే, ఈయన బొబ్బిలిపులి ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ తో దర్శకేంద్రుడు తీసిన 'పెళ్లి సందడి" ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి పోటిగా దాసరి టీవీ న్యూస్ రీడర్ వక్కంతం వంశీ, టీవి యాంకర్ సుమలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ 'కళ్యాణప్రాప్తిరస్తు" తీశారు. రాఘవేంద్రరావుకి 'పెళ్లిసందడి" ఎలాగో నాయు 'కళ్యాణప్రాప్తిరస్తు" అలా అని ఓ సందర్భంలో దాసరి వ్యాఖ్యానించారు. కాని దాసరి సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ విషయం అంతా ఎందుకటే తాజాగా దాసరి కొరియోగ్రాఫర్ అవతారమెత్తారు. అయితే గతంలో రాఘవేంద్రరావు 'పెళ్లి సందడి" చిత్రానికి తొలిసారి కొరియోగ్రఫీ వహించి ఏకంగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. దర్శకేంద్రుడి ఇన్ స్పిరేషన్ తో దర్శకరత్న నృత్య దర్శకుడిగా మారారు. తన 149వ తాజా చిత్రం 'యంగ్ ఇండియా" పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో 81 కొత్త నటీనటులు నటిస్తున్నారు. సిరి మీడియా బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి యమ్.యమ్.కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకేంద్రుడితో పోటి పడుతున్న దాసరి నంది అవార్డును అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu