పరమవీర చక్ర’కు జాతీయ అవార్డ్ అంటే నవ్వుతున్నారు....!?
దాసరి నారాయణరావు దర్శకత్వంలో త్రీ షేడ్స్ లో బాలకృష్ణ నటించిన 'పరమవీర చక్ర" బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. షీలా, అమీషా పటేల్, నేహాధూపియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. అయితే బుధవారం సాయంత్రం ఓ వేడుకలో పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు మాత్రం..'పరమవీర చక్ర"ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ చిత్రంలో బాలయ్య నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డ్ రావడం ఖాయం అని మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి బాలయ్య మంచి నటుడే కానీ ఆయన్ను ఈ చిత్రంలో దాసరి సద్వినియోగం చేసుకోలేదనే విమర్శఉంది. ఈ నేపథ్యంలో బాలయ్యకు జాతీయ స్థాయి అవార్డ్ వస్తుందని దాసరి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.
బాలకృష్ణ పవరమవీర చక్ర దాసరి నారాయణరావు షీలా అమీషా పటేల్ balakrishna parama veera chakra dasari narayana rao sheela amisha patel


Click it and Unblock the Notifications