»   » దాసరి, బాలయ్య 'పరమవీర చక్ర'పూర్తి డిటేల్స్

దాసరి, బాలయ్య 'పరమవీర చక్ర'పూర్తి డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పరమవీర చక్ర' రాజకీయ చిత్రం కాదు. రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. అది ఓ మంచి కథ అంతే. అంతకుమించి ఇంకేం మాట్లాడను. జూన్‌ 10న ఆ చిత్రం ప్రారంభమవుతుంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జూలై నుంచి ఉంటుంది. 2011 సంక్రాంతికి 'పరమవీర చక్ర' విడుదల అవుతుంది అంటూ వివరాలు వెల్లడించారు బాలకృష్ణ.

బాలకృష్ణ రాజకీయ ప్రవేశంపై పూర్తిస్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో దాసరి దర్శకత్వంలో 'పరమవీర చక్ర'చేయటంపై అంతటా కలుగుతున్న సందేహాలకు సమాధానంగా బాలకృష్ణ అలా స్పందించారు.అలాగే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేసే సినిమా గురించి చెపుతూ..కథ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. కథ ఓకే అయితే ఆగమేఘాల మీద షూటింగ్‌ జరిపి, విజయదశమికి సినిమాను విడుదల చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన అన్నారు. ఇక 'పరమవీర చక్ర'చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. అలాగే పూరీ తో చేయబోయే చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu