»   » చిరు లంకేశ్వరుడుకి పట్టిన గతే బాలయ్య పరమవీర చక్ర కూడా....

చిరు లంకేశ్వరుడుకి పట్టిన గతే బాలయ్య పరమవీర చక్ర కూడా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి-దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో వచ్చిన ఏకైక చిత్రం 'లంకేశ్వరుడు". దర్శకుడిగా దాసరికిది 100వ చిత్రం.ఈ చిత్రం ఫలితం గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాటలోనే 'పరమవీర చక్ర" కూడా పయనించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ-దాసరి ఫస్ట్ కాంబినేషన్ లో దాసరి 150వ చిత్రం వచ్చిన 'పరమవీర చక్ర" ప్రేక్షకులతో పరుగులు పెట్టిస్తోందని సమాచారం అందుతోంది.

ఇక ఈ రెండు చిత్రాలకు గల మరో ముఖ్య పోలిక ఏమిటంటే..'పరమవీర చక్ర" లో బాలకృష్ణ లంకేశ్వరుడిగా..అనగా రావణబ్రహ్మగా నటించడం. అంటే దాసరికి సిక్త్స్ సెన్స్ ఎక్కడో చెబుతూనే ఉందన్నమాట..ఈ చిత్రం మరో లంకేశ్వరుడు కానుందని. అందుకే ఈ చిత్రంలో బాలకృష్ణతో లంకేశ్వరుడు పాత్ర వేయించారాయన. వేరే సినిమాలు లేకుంటే..కనీసం వచ్చే సోమవారం వరకు కలెక్షన్లయినా బాగుండేవేమో కానీ..వరసబెట్టి సినిమాలు విడుదలవుతుండడం ఈ చిత్రానికి శాపంగా మారనుంది..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu