»   » రాజమౌళి, క్రిస్ ఇష్టం... హీరోల కాళ్ల వద్ద ఉండొద్దు: దాసరి

రాజమౌళి, క్రిస్ ఇష్టం... హీరోల కాళ్ల వద్ద ఉండొద్దు: దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరోసారి తన దర్శకలోకాన్ని ఆకాశానికి ఎత్తేసారు. ఈ మధ్య కొందరు దర్శకులు హీరోల కాళ్ల వద్ద ఉంటూ వారి ముద్దు చేతులు కట్టుకుంటూ ఉండే తీరును తప్పుబట్టారు. త్రిపుర మూవీ ఆయడియో ఫంక్షన్లో దాసరి ఈ వ్యాఖ్యలు చేసారు.

''దర్శకుడు అనేవాడు కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌. ఏ దర్శకుడైనా సక్సెస్‌ అయితే నేను సక్సెస్‌ అయినంత సంతోషపడతాను. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో క్రిష్‌, రాజమౌళి, శేఖర్‌ కమ్ముల అంటే నాకు చాలా ఇష్టం. గీతాంజలి చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన రాజకిరణ్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కేవలం డైరెక్టర్‌ వలనే గీతాంజలి సినిమా పెద్ద సక్సెస్‌ అయింది. నేను డైరెక్టర్‌ గురించే ఎక్కువగా మాట్లాడతానని నన్ను అందరు తిట్టుకుంటూ ఉంటారు. ఒకసారి స్టేజి మీద నాకు నటుడు శివాజీ గణేషన్‌‌కు ఈ విషయంలో వాదన జరిగింది. డైరెక్టర్‌ అనేవాడు చాలామంది యాక్టర్స్‌‌ను తయారుచేయగలడు కాని యాక్టర్‌, డైరెక్టర్‌‌ను క్రియేట్‌ చేయలేడని చెప్పాను. దర్శకుడు కమాండర్‌గా ఉండాలి కానీ హీరో మోకాళ్ళ దగ్గర ఉండకూడదు'' అని దాసరి అన్నారు.

స్వాతి, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్‌ దర్శకత్వంలో చినబాబు నిర్మిస్తున్న చిత్రం త్రిపుర. ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్‌ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను క్రిష్‌ జాగర్లమూడికి అందించారు.

ఓపెనింగ్స్ వస్తాయి..

ఓపెనింగ్స్ వస్తాయి..


ట్రైలర్‌ బావుంది. ఓపెనింగ్స్‌ బాగా వస్తాయి. కలర్స్‌ స్వాతి స్క్రీన్‌ ప్రెజన్స్‌ బావుంటుంది. తన కళ్ళతో చక్కగా నటిస్తుంది. అలా కళ్ళతో నటించే మరో నటి నిత్యామీనన్‌ అని అన్నారు దాసరి.

దసరా రిలీజ్

దసరా రిలీజ్


బాహుబలి, శ్రీమంతుడు చిత్రాల నుండి ప్రేక్షకులు సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. దసరాకు రిలీజ్‌ అయిన మూడు చిత్రాలు మంచి కలెక్షన్స్‌ సాధిస్తున్నాయి. చిన్న చిత్రాలు ఆడితే ఇండస్ట్రీకి పండగే. చిన్న సినిమా అని బడ్జెట్‌ చూసి అంటున్నాం కానీ అది హిట్‌ అయితే పెద్ద సినిమానే. ఈ రోజు పెద్ద సినిమాలకు ఎలాంటి లాభాలు ఉండట్లేదు.

లాభాలు

లాభాలు


త్రిపుర చిన్న చిత్రమయినా టేబుల్‌ ప్రాఫిట్‌‌లో ఉంది. తమిళంలో శైవం లాంటి మంచి చిత్రాన్ని ప్రొడ్యూస్‌ చేసిన నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. త్రిపురతో మంచి లాభాలొచ్చి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను అన్నారు.

గోస్ట్ జోనర్

గోస్ట్ జోనర్


నేను ఇప్పటివరకు గోస్ట్‌ జోనర్‌లో సినిమాలు చేయలేదు. ఆ జోనర్‌ వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు చూడగలిగే జోనర్‌ ఇది అన్నారు.

నవీన్ చంద్ర

నవీన్ చంద్ర


నవీన్‌ చంద్ర అందాల రాక్షసిలో నటించకముందు నుండే నాకు తెలుసు. తనను మొదట చూడగానే నచ్చేసాడు. పస్తుతం వారసత్వంతో హీరోలు అవ్వడమే తప్ప కొత్తవారికి అవకాశాలు దొరకట్లేదు. అలాంటి పరిస్థితులన్నీ దాటుకొని నవీన్‌ చంద్ర రాగలిగాడంటే గొప్ప విషయం అన్నారు.

English summary
Photos of Telugu Movie Tripura Audio Launch event held at Hyderabad. Naveen Chandra, Swathi Reddy, Dasari Narayana Rao and others graced the event.
Please Wait while comments are loading...