»   » మోహన్ బాబుకు ‘దాసరి స్వర్ణకంకణం’ ప్రదానం (ఫోటోస్)

మోహన్ బాబుకు ‘దాసరి స్వర్ణకంకణం’ ప్రదానం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు, అందరితో డైలాగ్ కింగ్ అని పిలిపించుకున్నమోహన్ బాబు, దర్శకరత్న దాసరి నారాయణ రావుకు ప్రియ శిష్యుడు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన సినీ వారసుడు మోహన్ బాబు అని దాసరి గతంలో ప్రకటించారు.

ప్రతి ఏటా దాసరి నారాయణ రావు పుట్టినరోజు సందర్భంగా శృతిల‌య ఆర్ట్స్‌ అకాడమీ వారు 'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పేరుతో సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన వారికి పురస్కారాలు ప్రధానం చేస్తున్నారు.

ఈ ఏడాది దాసరి 72వ పుట్టినరోజు సందర్భంగా ఆ గౌరవాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు అందుకున్నారు. 'గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మోహన్‌బాబుకి స్వర్ణకంకణం ప్రదానం చేసారు.

కార్యక్రమంలో దాసరి నారాయణరావుతో పాటు బాలీవుడ్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా, టి. సుబ్బిరామిరెడ్డి, ఏపీ మంత్రి గంట శ్రీనివాసరావు, నటుడు కోట శ్రీనివాసరావు, గిరిబాబు, నరేష్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు...

మోహన్ బాబుకు ‘దాసరి స్వర్ణకంకణం’ ప్రదానం (ఫోటోస్)

మోహన్ బాబుకు ‘దాసరి స్వర్ణకంకణం’ ప్రదానం (ఫోటోస్)

మోహన్ బాబుకు స్వర్ణ కంకణం తొడుగుతున్న ప్రముఖులు.

సన్మానం

సన్మానం

మోహన్ బాబుకు సన్మానం చేస్తున్న సినీ ప్రముఖులు.

దాసరికి సన్మానం

దాసరికి సన్మానం

అనంతరం దాసరి పుట్టినరోజు(మే 4న జరిగింది)పురస్కరించుకుని ఆయనతో కేక్ కట్ చేయించి, సన్మానం చేసారు.

కోట, గిరి బాబు

కోట, గిరి బాబు

మోహన్ బాబుకు స్వర్ణ కంకణ ప్రదానోత్సవం సందర్భంగా ప్రముఖులు కోట, గిరిబాబుతో పాటు నరేష్, మంచు మనోజ్ తదితరులు.

English summary
Dasari Swarna Kankanam Presented to Mohan Babu at Hyderabad on 5th May evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu