»   » 'పరమవీర చక్ర' గ్రేట్ ఫిల్మ్...దాన్ని పనిగట్టుకుని ప్లాప్ చేసారు

'పరమవీర చక్ర' గ్రేట్ ఫిల్మ్...దాన్ని పనిగట్టుకుని ప్లాప్ చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'పరమవీర చక్ర' గ్రేట్ ఫిల్మ్ అనేదాంట్లో మరో మాటకి తావు లేదు. దాన్ని నేను యూత్‌ని దృష్టిలో పెట్టుకుని తియ్యలేదు. ఇంతవరకూ ఒక్కరు కూడా ఆ సినిమా బాగాలేదని అనలేదు. ఎందుకో దానిమీద విపరీతమైన నెగటివ్ ప్రచారం చేశారు. లక్షా అరవై వేల ఎస్సెమ్మెస్సులు ఒకే చోట నుంచి వెళ్లాయి. ఇంటర్నెట్ ప్రభావం, ఎస్సెమ్మెస్సుల ప్రభావం చాలా ఎక్కువ ఉందనేది వాస్తవం అంటున్నారు దర్శకరత్న దాసరి. ఆయన ఈ రోజు తన 66 వ పుట్టిన రోజు జరుపుకుంటూ ఇలా కామెంట్ చేసారు.అలాగే పరమవీర చక్ర చిత్రంపై నెగిటవ్ టాక్ ని ఎవరు ప్రచారం చేస్తున్నారో, వాళ్ల ఆలోచన ఏమిటో అర్థం కావడం లేదు. ఏదైనా 'పరమవీరచక్ర'తో నేననుకున్నది జనానికి రీచ్ కాలేదు.'పరమవీరచక్ర' ఫలితమెలా ఉన్నా నా కెరీర్‌లో మాత్రం గుర్తుండిపోయే చిత్రం అది. బాలకృష్ణ చక్కటి నటన ప్రదర్శించాడు.'యంగ్‌ ఇండియా', 'పరమవీరచక్ర' చిత్రాలు నా మనసుకు ఎంతగానో నచ్చి తీసిన చిత్రాలవి. సమాజానికి ఉపయోగకరమైన చిత్రాలు తీశానన్న ఆత్మసంతృప్తి నాకుంది. చిత్రసీమలో జయాపజయాలు సర్వసాధారణం అని తేల్చేసారు.ఆయనకు ధట్స్ తెలుగు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Dasari Narayana Rao is still confident, his directorial venture which also happens to be his 150th film Parama Veera Chakra. Dasari Narayana Rao addressed media at his residence on yesterday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu