ఇటలీలో అతనితో గడుపాలనుకొన్నా.. అంతా నా తలరాత.. వర్కవుట్ కాలేదు.. దీపికా

By Rajababu

ఓం శాంతి ఓం చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన దీపికా పుదుకొనె గురువారం తన 32వ జన్మదినాన్ని జరుపుకొంటున్నది. దశాబ్ద కాలం నాటి కెరీర్‌లో పలువురు హీరోలతో అఫైర్లు, బ్రేకప్‌లతో నెట్టుకొస్తున్నది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో అఫైర్‌ను కొనసాగిస్తున్నది. ఇలాంటి ఒడిదొడుకుల ఆమె జీవితంలోని కొన్ని విశేషాలు మీ కోసం..

రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం

రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం

బాలీవుడ్‌లో టాప్ యాక్టర్‌ రేంజ్‌కు చేరుకొన్న దిపికా పదుకొన్ మొదట్లో కపూర్ నట వారసుడు రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. ఓ దశలో పెళ్లి కూడా ఖారారైనట్టు వార్తలు వచ్చాయి. అయితే కరీనా, కరిష్మా కపూర్లు అడ్డుపడినట్టు మీడియాలో ప్రచారం జరిగింది.

రణ్‌బీర్‌తో హానీమూన్‌కు ప్లానింగ్

రణ్‌బీర్‌తో హానీమూన్‌కు ప్లానింగ్

రణ్‌బీర్‌తో పెళ్లి కూడా నిర్ణయమైన సమయంలో మ్యారేజ్ తర్వాత జరిగే ప్లానింగ్‌‌ను చక్కగా చేసుకొన్నదట. పెళ్లి తర్వాత ఇటలీలో హానీమూన్‌కు ప్రిపేర్ అయిందట. ఇలాంటి విషయాలను ఆ మధ్య బచ్‌నా ఏ హసీనా ప్రమోషన్ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాఠకులతో పంచుకొన్నారు.

ఆన్‌స్క్రీన్ రొమాన్స్ కష్టం కాదు

ఆన్‌స్క్రీన్ రొమాన్స్ కష్టం కాదు

ఆఫ్ స్రీన్ బాయ్‌ఫ్రెండ్‌తో ఆన్‌స్క్రీన్‌పై రొమాన్స్ చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది, తేడాలు అనిపించవు. సినిమా వేరు.. వాస్తవ జీవితం వేరు అని దీపికా చెప్పారు. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అతను బాయ్‌ఫ్రెండ్ అనే విషయాన్ని మరిచిపోతాను. కేవలం పాత్ర మాత్రమే కనిపిస్తుంది.

ఆ పాట మధురమైన

ఆ పాట మధురమైన

రణ్‌బీర్‌, నేను కలిసి నటించిన బచ్‌నా ఏ హసీనో ఖుదా జానో పాటను సిడ్నీలో చిత్రీకరించారు. జీవితంలో ఆ షూటింగ్ మధురంగా మిగిలిపోయింది. దాదాపు సిడ్నీలో 25 రోజులు కలిసి ఉన్నాం. ఆ షూటింగ్ మెమోరీస్‌ ఎప్పుడూ నన్ను వెంటాడుతుంటాయి.

రణ్‌బీర్‌తో సిడ్నీ, ఇటలీ జర్నీ

రణ్‌బీర్‌తో సిడ్నీ, ఇటలీ జర్నీ

సిడ్నీ తర్వాత మరికొన్ని రోజులు ఇటలీలో షూటింగ్ చేశాం. మాపై మా మీద ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించారు. ఆ పాట కోసం మునుపెన్నడూ లేని అద్భుతమైన ప్రదేశాన్ని మేం చూశాం. ఆ ప్రదేశంలో హానీమూన్ జరుపుకోవాలని అప్పుడే అనుకొన్నాను.

రణ్‌బీర్‌ కపూర్‌తో హ్యాపీ

రణ్‌బీర్‌ కపూర్‌తో హ్యాపీ

రణ్‌బీర్‌తో షూటింగ్ అంటే చాలా హ్యాపీగా ఉండేది. ఒకరోజు ఓ ప్రదేశంలో షూట్ చేసిన తర్వాత రాత్రికి వేరే ప్రదేశానికి వెళ్లే వాళ్లం. అక్కడ షూట్ చేసిన తర్వాత మరో ప్రదేశానికి మారాం. ఆ పాట కోసం అంత మొత్తంలో మరొకరు ట్రావెల్ చేసి ఉండరు అని నేను అనుకొంటాను.

ఆ పాట కారణంగా ప్రేమలో

ఆ పాట కారణంగా ప్రేమలో

రణ్‌బీర్, నా జీవితంలో ఖుదా జానే పాట ఓ స్పెషల్. ఆ పాట సందర్భంగానే వారిద్దరూ ప్రేమలో పడినట్టు చెప్పుకొంటారు. ఆ పాట వారిద్దరూ మనసులు కలుసుకోవడానికి కారణమైందట.

ఆ జర్నీ మరిచిపోలేనిది

ఆ జర్నీ మరిచిపోలేనిది

జీవితంలో సిడ్నీ, ఇటలీ జర్నీ అత్యంత మధురమైనది. పాట చిత్రీకరణ సందర్భంగా ఓ ప్రదేశంలో చాలా సంఖ్యలో పావురాలు ఉన్నాయి. పాటకనుగుణంగా డ్యాన్సులు చేస్తుంటే పావురాలు మధ్యలో దూరేవి. షూటింగ్ చేయడానికి చాలా కష్టమైంది.

పావురాలు అడ్డుపడేవి

పావురాలు అడ్డుపడేవి

షూటింగ్‌కు అడ్డు రాకుండా ఉండేందుకు పావురాలకు ఆహారం పెడుతూ దూరంగా తీసుకెళ్లేదానిని. అయినా ఓ 20, 30 పావురాలు వచ్చి మీద వాలేవి. అదో అందమైన అనుభవం అని దీపికా పదుకొన్ చెప్పింది.

పద్మావతి చిత్రంలో దీపికా

పద్మావతి చిత్రంలో దీపికా

షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రస్తుతం పద్మావతి చిత్రంలో నటిస్తున్నది. సెన్సార్ వివాదాల కారణంగా ఆ చిత్రం విడుదల వాయిదా పడింది. దాదాపు 25కి పైగా కట్స్‌తో పద్మావత్ పేరుతో ఫిబ్రవరి 9న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X