»   » పెళ్లికి ముందు ప్రేమించుకున్నాం‌: ఉదయ్ కిరణ్ భార్య

పెళ్లికి ముందు ప్రేమించుకున్నాం‌: ఉదయ్ కిరణ్ భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వివాహానికి ముందు హీరో ఉదయ్ కిరణ్‌తో ఏడాదిన్నర పాటు ప్రేమాయణం సాగించినట్టు ఆయన భార్య విషిత చెప్పింది. ఇటీవల ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఉదయ్ కిరణ్ భార్య విషితను పోలీసులు మరోసారి విచారించారు.

Dating with Uday Kiran before wedding: Visheeta

పెళ్లికి ముందు తాను, ఉదయ్ కిరణ్ ఏడాదిన్నర ప్రేమించుకున్నామని, ఆ మధ్యకాలంలో తాము మనస్సు విప్పి అన్ని అంశాలపై మాట్లాడుకునేవాళ్లమని విషిత పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తమ మధ్య పెళ్లికి ముందు లేదా వివాహం తర్వాత ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేసింది.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విషిత తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. కాసేపటి తర్వాత తాను పార్టీకి వస్తానని ఉదయ్ తనతో చెప్పారని, కానీ అంతలోని ఈ ఘోరానికి పాల్పడ్డారని ఏడ్చేశింది.

ఆర్థిక సమస్యలు, కెరీర్ ఆశాజనకంగా లేకపోవడమే ఉదయ్ కిరణ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించాయిని పోలీసులు భావిస్తున్నారు. తనను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయాడని విషిత అంతకు ముందు పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

English summary

 Uday Kiran wife Vishitha told to the police that they are in love before weddingfor one and half year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu