»   » మంచు లక్ష్మి కూతురు...తల్లికి మేకప్ వేస్తోంది

మంచు లక్ష్మి కూతురు...తల్లికి మేకప్ వేస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటాయి. అవి తల్లికి ఎనలేని ఆనందాన్ని కలగచేస్తూంటాయి. ఇప్పుడు మంచు లక్ష్మి అలాంటి మాతృత్వపు ఆనందాన్నే పొందుతోంది. అంతేకాదు తన స్నేహితులతో తన ఆనందాన్ని సైతం పంచుకుంటోంది. తన కుమార్తె విద్యా నిర్వాణ గురించి ఆమె తాజాగా ఓ అప్ డేట్ పెట్టారు. అదేమిటంటే... ఈ ఫొటో పెట్టి...మా అమ్మకు మేకప్ పేస్తున్నా అని రాసుకొచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తాజాగా ఆమె నిర్మాతగా, నటిగా చేసిన దొంగాట చిత్రం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే కలెక్షన్స్ కూడా వీకెండ్ లోనే కాకుండా సోమవారం కూడా బాగున్నాయని సమాచారం. దాంతో ఆమె చాలా చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన తర్వాత హిట్టై,డబ్బులు తెచ్చి పెడుతున్న సినిమా ఇదే అని చెప్పాలి.


Daughter doing makeup for Manchu Lakshmi

మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు', 'గుండెల్లో గోదారి', 'వూ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాల ద్వారా నటిగా గుర్తింపు తెచ్చుకొని... మరోవైపు నిర్మాతగానూ రాణిసున్నారు. ఆమె నటించి, నిర్మించిన చిత్రం 'దొంగాట' క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగిన సినిమా.


దొంగాట కథ ఏమిటంటే...


వెంకట్ (అడవి శేషు), విజ్జు (మధు), కాటంరాజు (ప్రబాకర్) కలిసి ... స్టార్ హీరోయిన్ శృతి(మంచు లక్ష్మి)ని కిడ్నాప్ చేసి సెటిలైపోవాలనుకుంటారు. కిడ్నాప్ వరకూ విజయవంతంగా చేసి, ఆమె తల్లి (పవిత్ర) నుంచి పది కోట్లు డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా...మధు బాస్... అయిన బ్రహ్మీ (బ్రహ్మానందం) ఇంటిలో ఆమెను సేఫ్ గా పెడతారు. బ్రహ్మీ యుఎస్ ఎ లో ఉంటూంటాడు.


అనుకోని విధంగా...బ్రహ్మీ... ప్రెవేట్ డిటెక్టివ్ గా ఎంట్రీ ఇచ్చి... ఈ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి రంగంలోకి దిగుతాడు. ఎప్పుడైతే తన ఇంట్లోనే శృతి ని దాచారని బ్రహ్మికి తెలుస్తుందో అప్పటినుంచే సమస్యలు మొదలవుతాయి. దాంతో ఆ కిడ్నాప్ డ్రామా వీరు అనుకున్నట్లుగా సాగదు. అనుకోని అవాంతరాలు వస్తాయి. తర్వాత ఏమైంది. అసలు కథలో దాగి ఉన్న ఇంకో ట్విస్ట్ ఏమటి...మిగతా కథ.

English summary
Recently Laxmi shared a cute update of her daughter.The actress posted a picture of Vidya Nirvana with a makeup brush in her lap. The actress posted: "Good Morning... Amma ki makeup vesthunna"
Please Wait while comments are loading...