తాప్సీకి ట్విస్ట్ ఇస్తున్న సిద్దార్ధ
వరస ప్లాపుల హీరో సిద్దార్ద అంటే తాప్సీ భయపడుతోంది. ఎందుకంటే డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందనున్న బాలీవుడ్ చిత్రం కోసం సిద్దార్దని ఎంపికచేసారు. అయితే అంతకు ముందే ఈ చిత్రం కోసం తాప్సీ ని ఎంపిక అయ్యింది. అయితే ఇప్పుడు సీన్ లోకి వచ్చిన సిద్దార్ధ తన ప్రేయసి శృతి హాసన్ ని తీసుకోమని డేవిడ్ ధామన్ తో చర్చలు జరుపుతున్నాట్ట. దాంతో ఈ విషయం తెలుసుకున్న తాప్సీ తన బాలీవుడ్ ఎంట్రీకి నిప్పు పెడుతున్న సిద్దార్ద ని ఏమనాలో అర్దం కాక చూస్తోంది.అయితే ఇంకా తాప్సీని తీసేసి శృతి ని తీసుకోలేదు కాబట్టి తాప్సీ ఏమి మాట్లాడలేకపోతోంది.ఎందుకంటే తాప్సీనే కంటిన్యూ అయితే సిద్దార్ధతో కలిసి ఆ చిత్రంలో నటించాలి కాబట్టి ఆమె అస్సలు ఆ విషయం తెలియనట్లే ఉంటోంది.


Click it and Unblock the Notifications











