దావూద్ ఇబ్రహీం నోట...రామ్ గోపాల్ వర్మ టాపిక్

బెదిరింపులు రాగానే బాబా సిద్ధిఖీ హుటాహుటిన ముఖ్యమంత్రి వద్దకు పరుగులు పెట్టి తనతోపాటు తన కుటుంబానికీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దానిపై సీఎం చవాన్ అంగీకరించారు. ఇకనుంచి సిద్ధిఖీకి నిరంతరం ఇద్దరు కానిస్టేబుళ్లు కాపలా ఉంటారు. దావూద్ సన్నిహితుడు అహ్మద్ లంగడాతో బాబా సిద్ధిఖీకి ముంబయిలో ఓ భూవివాదం ఉంది. ఈ వివాదంలో తప్పుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని ఇటీవల ఛోటా షకీల్ బెదిరించాడు.
దీనిపై సిద్ధిఖీ ఫిర్యాదు మేరకు అహ్మద్ లంగడాను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో బాబా సిద్ధిఖీకి దావూద్ ఫోన్ చేసి.. 'భూవివాదం నుంచి నిష్క్రమించకపోతే నీ జీవిత చరిత్రపై 'ఏక్ థా ఎమ్మెల్యే' పేరుతో సినిమాను నిర్మించాలని రాంగోపాల్ వర్మతో చెప్తానని హెచ్చరించాడని, అంటే నన్ను చంపేస్తారని అర్థమ'ని చెప్పారు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ అంబదాస్ పోటే ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు 'సామ్నా'లో ప్రచురితమైంది. చీకటి సామ్రాజ్యం నేపథ్యంతో చిత్రాలు తీయడంలో రాంగోపాల్‌వర్మ ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











