»   » అల్లు అర్జున్ ఆమెకు అంతబాగా నచ్చాడు

అల్లు అర్జున్ ఆమెకు అంతబాగా నచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆయన సెట్ ‌లో ఉన్నంత సేపూ సరదాగా గడిచిపోయేది. నేను కొత్త అమ్మాయిని తను స్టార్‌ హీరో అనే తేడాలు చూపించకుండా ఎన్నో సలహాలు ఇచ్చేవారు అంటూ అల్లు అర్జున్ గురించి నాన్ స్టాప్ గా చెప్పేస్తోంది దీక్షాసేథ్. వేదం చిత్రంలో డబ్బున్న అమ్మాయి పాత్రలో నటించిన ఆమె మాట్లాడుతూ..."వేదంలో అందరి పాత్రలు నాకు బాగా నచ్చాయి. నన్ను ప్రేమించిన కేబుల్‌ రాజు పాత్రంటే మరీ ఇష్టం. హోటల్ ‌లో డబ్బులు కట్టే సన్నివేశంలో బన్నీ నటన కంట తడి పెట్టించింది. ఆ ఒక్క సన్నివేశం చాలు మనసుని హత్తుకోవడానికి. భిన్న భావోద్వేగాలు చక్కగా పలికించాడు బన్నీ" అలాగే ఈ సినిమాలో అనుష్క అందమే అందం. సరోజ పాత్రలో చక్కగా ఒదిగిపోయారామె అంది.

ప్రస్తుతం దీక్షా సేధ్...రవితేజ సరసన మిరపకాయ్‌ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా గురించి చెబుతూ...వినోభరితంగా సాగే చక్కని సినిమా అది. పాత్ర ప్రకారం హద్దులు దాటకుండా అందాన్ని ప్రదర్శిస్తాను. ఇక తన లక్ష్యం గురించి చెబుతూ...నేను పోషించే పాత్రల ద్వారా ప్రేక్షకులకు చేరువకావాలి. మంచి కథ ఉండే సినిమాల్లో నటించడానికి నేను సిద్దం. ప్రస్తుతం రవితేజతో మిరపకాయ్‌ లో నటిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు. అంతకంటే ప్రత్యేకమైన లక్ష్యాలు ఏమీ లేవు అంటూ తేల్చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X