Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ముచ్చడపడే హీరో రికమెండ్ చేసాడంటోన్న దీక్షాసేధ్
సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను కనబరిచిన ఏకాగ్రత చూసి విక్రమ్ ఎంతో ముచ్చట పడ్డారు. అంతేకాదు... లేడీ ఓరియంటెడ్ సినిమాలను తీయడానికి సిద్ధమవుతున్న ఒకరిద్దరు నిర్మాతలకు నా పేరును రికమండ్ చేశార అంటోంది దీక్షాసేధ్. ఆమె తమిళంలో విక్రమ్ సరసన రాజపట్టాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సినిమాలో దీక్ష కొన్ని స్టంట్ సీన్స్ లో నటించారు.అలాగే త్వరలోనే తమిళంలో ఓ పవర్‌ఫుల్ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో దీక్ష నటించనుందని చెప్పింది. ఇటీవల ఓ తమిళ చానల్‌లో ఇచ్చిన తాజా ఇంటర్‌వ్యూలో ఈ విషయాన్ని దీక్ష ప్రస్తావించారు . అలాగే మొదట్నుంచీ యాక్షన్ సినిమాలంటే ఇష్టం. కత్తి పట్టుకుని యుద్ధం చేయాలంటే ఇంకా ఇష్టం. అలాంటి పాత్ర ఎవరైనా ఆఫర్ చేస్తే... రిస్కీ స్టంట్స్ చేయడానికి కూడా నేను వెనుకాడను. లైఫ్‌లాంగ్ నిలిచిపోయే అరుంధతి లాంటి పాత్రను చేయాలని ఉంది. నా కల నిజమయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయ్ అని ఆ ఇంటర్‌వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రెబల్ లోను, రవితేజకు జోడీగా నిప్పు చిత్రంలోను చేస్తోంది. అలాగే తమిళంలో విక్రమ్‌తో పాటు శింబు సరసన కూడా ఓ చిత్రంలో నటిస్తోంది.తెలుగులో ఆమె మొదట అల్లు అర్జున్ సరసన వేదం చిత్రంలో చేసింది. ఆ తర్వాత గోపీచంద్ సరసన వాంటెడ్ లో చేసింది.అయితే రవితేజ సరసన మిరపకాయ చిత్రం తో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆఫర్స్ సంపాదించుకుంది.