»   » మిరపకాయ్ బుజ్జిని వదలలేకే రవితేజ మళ్ళీ తీసుకున్నాడు

మిరపకాయ్ బుజ్జిని వదలలేకే రవితేజ మళ్ళీ తీసుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాతికి విడుదలైన రవితేజ మిరపకాయ్ చిత్రంలో చేసి అదరకొట్టిన దీక్షాసేధ్ కి మరో సారి రవితేజ సరసన బుక్కయింది. గుణశేఖర్ దర్సకత్వంలో వైవియస్ చౌదరి నిర్మించనున్న నిప్పు చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. రవితేజ రికమండేషన్ మీదే ఆమెను తీసుకున్నట్లు చెప్తున్నారు. మిరపకాయ్లో ఆమె సెకెండ్ హీరోయిన్ గా చేస్తే ఇందులో ఆమెకు మెయిన్ హీరోయిన్ గా ప్రమోషన్ ఇప్పించాడు రవితేజ. మే 28వ తేదీన ప్రారంభమయ్యే ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం అందిచనున్నారు.ప్రస్తుతం దీక్షాసేధ్..లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న రెబల్ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రభాస్ హీరో గా చేస్తున్న ఈ చిత్రంలో అనూష్క ఫస్ట్ హీరోయిన్ గా కనపడనుంది. ఇక దీక్షాసేధ్ వేదం చిత్రంతో పరచయమై ఆ తర్వాత గోపిచంద్ సరసన వాంటెడ్ లో చేసింది.బి.వియస్ రవి దర్సకత్వంలో రూపొందిన వాంటెడ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

English summary
Long legged lass Deeksha Seth has bagged another big movie. Now, this beauty opposite Ravi Teja in Nippu. Director Gunasekhar is okayed her to be the heroine of Ravi Teja. The film is to be launched on May 28th. YVS Chowdhary is producing the film while Yuvan Shankar Raja is providing the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu