»   » షూటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నా...దీక్షాసేధ్

షూటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నా...దీక్షాసేధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వేదం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దీక్షాసేధ్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది.రీసెంట్ గా ఆమె రవితేజ 'మిరపకారు' చిత్రంలో చేసింది. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ...నేను ప్రస్తుతం ముంబయిలోని కాలేజీలో బికామ్‌ చదువుతున్నా , సినిమా షూటింగ్‌ కోసం పర్మిషన్‌ తీసుకుని వచ్చాను.షూటింగ్‌ పూర్తయిన తరువాత మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకుంటానని చెప్పింది.అలాగే మిరపకారు సినిమాలో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం నేను తెలుగు నేర్చుకుంటున్నాను. అందుకోసం ఓ పుస్తకాన్ని తీసుకున్నాను. ఆ పుస్తకం సహాయంతో నా చుట్టూ ఉండే నా సహాయకులతో తెలుగు మాట్లాడుతూ ప్రాక్టీస్‌ చేస్తున్నాను.

మరో ఏడు నెలల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటాను. నాకు తెలుగు, ఇంగ్లీష్‌లతో పాటు చాలా భారతీయ భాషలు తెలుసు.నేను ఎక్కడికి వెళితే అక్కడి భాషను నేర్చుకుంటాను అంది. తాను సినిమాల కోసం ప్రత్యేకంగా శిక్షణలేమీ తీసుకోలేదని తనకా అవసరం రాలేదని అంది. మిరపకారు సినిమా నన్ను సినిమా పరిశ్రమలో నిలబడేట్టు చేస్తుందనే నమ్మకం ఉంది. మామూలుగా సినిమా కథలను ఎన్నుకునేముందు కథను పాత్ర ప్రాధాన్యతను బట్టి సెలక్ట్‌ చేసుకుంటానని దీక్షసేత్‌ తెలిపింది.అలాగే ఆమె గోపీచంద్ సరసన వాంటెడ్ చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇక మిరపకాయ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. షాక్ ఫేమ్ హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నారు.

Please Wait while comments are loading...