»   »  ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' కొత్త పోస్టర్

ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' కొత్త పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా విడుదల చేసారు. ఈ క్రింద ఆ పోస్టర్ ని చూసి ఎంజాయ్ చేయండి.

ఈ చిత్రంలో ఎన్టీఆర్...లండన్ లో స్ధిరబడ్డ మల్టి మిలియనీర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. అందుకే ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ముంబై స్టైలిస్ట్ చేత డ్రస్ లు డిజైన్ చేయించారు. అలాగే ఎన్టీఆర్ హెయిర్ స్టెయిల్, గడ్డం, లుక్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడవే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాయి.

కథ ప్రకారం సినిమాలో ఎక్కువ భాగం ఫారిన్ కంట్రీలో జరగనుంది. అందులో భాగంగా ..నవంబర్ 15 న స్పానిష్ కు వెళ్తున్నారు. రీసెంట్ గా యుకె లో 90 రోజుల పాటు కంటిన్యూ గా షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రం సంక్రాంతికు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Deepavali Special: Nannaku Prematho In New Poster

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల తరఫున విశేష స్పందన రావడంపై ఎన్టీఆర్‌ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా స్పందించారు. టీజర్‌ను 20 లక్షల మంది వీక్షించడం, 39 వేల లైక్స్‌ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అభిమానుల నుంచి లభించిన ఈ అనూహ్య స్పందన మొత్తం చిత్ర బృందానికి పెద్ద శక్తిని అందించిందంటూ పోస్ట్‌ చేశారు

ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Ntr's Nannaku Prematho new poster relased. In this movie NTR playing a rich businessman. He is sporting trendy looks that were designed by a Mumbai stylist.
Please Wait while comments are loading...