»   »  దీపికా పడుకొనే డిమాండ్ ఒక కోటి?

దీపికా పడుకొనే డిమాండ్ ఒక కోటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Deepika Padukone

శంకర్ రోబోట్ సినిమా బడ్జెట్ రూ.100కోట్లు అన్న సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ ఒక్కటే అయితే పేలుతుందని కాబోలు అయ్యంగ్రాన్ ఇంటర్నేషనల్, ఎరోస్ మల్టీ మీడియా బ్యాన్నర్ సంస్థలు సంయుక్తంగా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని ఎఆర్ రహమాన్ అందించనున్నాడు.

రోబోట్ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకొనే చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమా కోసం దీపిక రూ.1కోటి డిమాండ్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు. తమిళ, హిందీ, తెలుగు భాషలతో పాటు చైనీస్, జపనీస్, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ఈ నెల 11న జరిగే శివాజీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో రోబోట్ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X