»   » హాట్‌హాట్‌గా దీపిక ఫొటోషూట్.. మోతాదు మించిన అందాల ఆరబోత

హాట్‌హాట్‌గా దీపిక ఫొటోషూట్.. మోతాదు మించిన అందాల ఆరబోత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పడు బాలీవుడ్‌కే పరిమితమైన దీపికా పదుకొనే అందాల ఆరబోత ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి చేరుకొన్నది. హాలీవుడ్‌లో బాలీవుడ్ శృంగార దేవత ప్రియాంక చోప్రాకు ధీటుగా దీపిక అందాలను గుమ్మరిస్తున్నది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ఫొటోషూట్‌లు అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీ కోసం ఫొటోషూట్ నిర్వహించింది. ఈసారి కాస్త అందాల ఆరబోత ఎక్కువే అయిందనే మాట వినిపిస్తున్నది.

వివిధ భంగిమలలో దీపిక ఫొటోషూట్

వివిధ భంగిమలలో దీపిక ఫొటోషూట్

జ్యువెల్లరీ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కోసం దీపిక రాయల్ ప్రిన్సెస్ అవతారాన్ని ఎత్తింది. వివిధ భంగిమల్లో జరిపిన ఫొటోషూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. మోడర్న్ జ్యువెల్లరీ ధరించి సంప్రదాయ పద్ధతిలో కాస్తా బుద్ధిగా దస్తులు ధరించడం విశేషం.

ట్రిపుల్ ఎక్ప్ చిత్రంలో చివరిసారిగా..

ట్రిపుల్ ఎక్ప్ చిత్రంలో చివరిసారిగా..

దీపికా పదుకొనే చివరిసారిగా హలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్ అనే చిత్రంలో నటించింది. నటుడు విన్ డీజిల్‌తో కలిసి జరిపిన వెండితెర శృంగారంతో హాలీవుడ్ భామలే సిగ్గుపడ్డారు. ప్రస్తుతం మరో హలీవుడ్ చిత్రంలో నటించనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

పద్మావతి చిత్రంలో రాణిగా

పద్మావతి చిత్రంలో రాణిగా

బాలీవుడ్‌లో ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిలో నటిస్తున్నది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్ జంటగా నటిస్తున్నారు.

విశాల్ భరద్వాజ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్

విశాల్ భరద్వాజ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్

ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించే చిత్రానికి కూడా దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హీరోగా కనిపించనున్నారట. ఈ చిత్రంలో దీపిక స్వప్నా దీదీ అనే గ్యాంగస్టర్ పాత్రలో కనిపిస్తారనే తాజా సమాచారం.

మళ్లీ విన్ డీజిల్‌తో

మళ్లీ విన్ డీజిల్‌తో

ట్రిపుల్ ఎక్స్‌కు సీక్వెల్‌గా విన్ డీజిల్‌తో రూపొందించే చిత్రంలో నటించేందుకు దీపిక అంగీకారం తెలిపిందని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డీజే కరుసో వెల్లడించారు.

నవంబర్ 17న పద్మావతి

నవంబర్ 17న పద్మావతి

తన మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్‌తో కలిసి నటిస్తున్న పద్మావతి చిత్రం నవంబర్ 17న విడుదలకు సిద్దమవుతున్నది.

రాబ్దాలో స్పెషల్ సాంగ్..

రాబ్దాలో స్పెషల్ సాంగ్..

ఇటీవల బాలీవుడ్‌లో వివాదాస్పదంగా నిలిచిన రాబ్దా చిత్రంలో ఓ పాటలో దీపిక పదుకొనే మెరిసింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కీర్తీ సనన్‌తో కలిసి అతిథి పాత్రలో కనిపించింది.

తనిష్క్ కోసం తల్లిదండ్రులతో..

తనిష్క్ కోసం తల్లిదండ్రులతో..

తాజాగా జరిపిన ఫొటోషూట్ ప్రముఖ జ్యువెల్లరీ కంపెనీ తనిష్క్ కోసమట. గతంలో కూడా తన తండ్రి ప్రకాశ్ పదుకొనే, తల్లి, ఉజ్జల పదుకొనేతో కలిసి ఈ కంపెనీ యాడ్‌లో కనిపించింది.

బ్రాండ్ అంబాసిడర్‌గా..

బ్రాండ్ అంబాసిడర్‌గా..

గత కొద్దికాలంగా తనిష్క కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ పాత్రను పోషిస్తున్నది. ఈ కంపెనీ కోసం ఇటీవల దిగిన ఫొటోలు చాలా సంప్రదాయకంగా రీతిలో ఉన్నాయి.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

తనిష్క్ కంపెనీ కోసం జరిపిన ఫొటోషూట్ వివరాలను, ఫొటోలను దీపిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన కనిపిస్తున్నది.

English summary
Deepika Padukone has shot for a jewellery brand looking nothing less than a true royal princess. The actor did the photoshoot in several different, regal dresses and gowns paired with traditional and modern jewellery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu