»   »  మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచ్‌లర్‌ హీరో,హీరోయిన్ వీళ్లే

మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచ్‌లర్‌ హీరో,హీరోయిన్ వీళ్లే

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ :బాలీవుడ్‌లో హీరోయిన్ గా మొదటిస్థానం కోసం పోటీపడే వాళ్లలో దీపికా పదుకొణే, కత్రినాకైఫ్‌ ముందుంటారు. ఇప్పుడు మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచ్‌లర్‌ ఎవరూ అంటూ ఓ మేట్రిమోనీ సంస్థ చేపట్టిన సర్వేలోనూ వీరిద్దరూ గట్టిగా తలపడ్డారు. ఇందులో దీపిక 32.02 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. కత్రినా కైఫ్‌ 29.76 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచింది.

  ఆ తర్వాత స్థానాల్లో అనుష్క శర్మ (20.14), ప్రియాంక చోప్రా (18.08) నిలిచారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశమేంటంటే మోస్ట్‌వాంటెడ్‌ బ్యాచ్‌లర్‌ పురుషుల విభాగంలో రణబీర్‌ కపూర్‌ 31.4 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. సల్మాన్‌ఖాన్‌ (25.6), రాహుల్‌గాంధీ (21.98), విరాట్‌ కోహ్లి(21.02) తర్వాత స్థానాల్లో ఉన్నారు.


  ఇక 'చాందినీ బార్, పేజ్ 3, ఫ్యాషన్, హీరోయిన్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుర్ బండార్కర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దీపికా కొట్టేశారనే వార్త వచ్చింది. ఈ చిత్రానికి 'క్యాలెండర్ గాళ్' అనే టైటిల్‌ని ఎంపిక చేశారనే వార్త వచ్చింది. కానీ, ఈ వార్తను మధుర్ ఖండిస్తున్నారు. అసలు 'క్యాలెండర్ గాళ్' పేరుతో సినిమా చేసే ఉద్దేశమే లేనప్పుడు హీరోయిన్ ను ఎలా ఖరారు చేస్తానంటున్నారు మధుర్. ఒకవేళ ఈ టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం కాకుండా వేరే సినిమాలో ఏమైనా దీపికాని ఎంపిక చేశారేమో తెలియాల్సి ఉంది.

  అలాగే ''ఒక నటిగా ఏదో ఒక భాషకు మాత్రమే పరిమితం కాను. మంచి కథ దొరికితే టాలీవుడ్.. శాండిల్‌వుడ్.. ఎక్కడైనా నటించడానికి సిద్ధమే'' అని చెప్పారు. ఇక హిందీ చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'లో లుంగీ కట్టుకోవడం గురించి చెబుతూ -''నేను పెరిగిందంతా బెంగళూరులోనే. అక్కడ తమిళులు ఎక్కువగా ఉండడంతో వాళ్ల వేషభాషలపై నాకు మంచి అవగాహన ఉంది. అందుకే లుంగీలో కనిపించడం అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. కాకపోతే లుంగీలో నాకు నేనే చాలా డిఫరెంట్‌గా కనిపించా'' అన్నారు.

  English summary
  Actor Ranbir Kapoor has been voted as the most wanted bachelor in the country in a survey conducted by a matrimonial site, while Deepika Padukone has been declared the most sought after bachelorette. The survey was conducted by matrimonial site Shaadi.com with over 7,000 men and women in the age bracket of 24-30 years taking part. This was part of the India's Most Wanted Celebrity survey. Ranbir, who has been part of hit movies like 'Rockstar', 'Barfi!' and 'Yeh Jawaani Hai Deewani', won the title after 31.4 percent women voted for him, read a statement.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more