దుమ్ము దులుపుతుందనుకుంటే బాగా దెబ్బకొట్టేసింది
రాణా, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో రూపొంది విడుదలైన చిత్రం'దమ్ మారో దమ్". ఈ చిత్రం విడుదలకు ముందు ప్రతి ఒక్కరూ దీపికపదుకునె ఐటం సాంగ్ గురించే చర్చించుకున్నారు. అలాగే దర్శక, నిర్మాతలు కూడా ఈ ఐటం సాంగ్ పైనే బాగా ఆశలు పెట్టుకున్నారు. అంతేగాక బిసిసిఐ నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఈ ఐటంసాంగ్ విడుదల చేయటంతో మంచి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఇంటర్నెట్లో కూడా ఆ పాట బాగా పాపులర్ అయ్యింది. అయితే సినిమా విడుదలయ్యాక ఆ పాటకు అంత సీన్ లేదని తేలిపోయింది. అంతేగాక దీపిక డాన్స్ చేసిన ఈ టైటిల్ సాంగ్ ఆ చిత్రానికి ఏ మాత్రం హెల్ప్ కాకపోగా మైనస్‌గా మారిందని రివ్యూలు వచ్చాయి. దాంతో ఈ రివర్స్ సీన్ కి అంతా షాక్ అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని రాణా తండ్రి సురేష్ బాబు తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెకెండాఫ్ మొత్తం రాణా మీద నడపటంతో ఇక్కడ రిలీజ్ చేయటానికి సరిపోతుందని బావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











