»   » అవన్నీ రూమర్లే, హాలీవుడ్ లో మరోసారి మెరవనున్న భారతీయ భామలు: భామలిద్దరికీ చెరో ఆఫర్

అవన్నీ రూమర్లే, హాలీవుడ్ లో మరోసారి మెరవనున్న భారతీయ భామలు: భామలిద్దరికీ చెరో ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల భామ‌లు దీపిక ప‌దుకొణే, ప్రియాంక చోప్రా. వీరిద్ద‌రు గ‌తేడాది హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీపిక ట్రిపుల్ ఎక్స్ : రిట‌ర్న్ ఆఫ్ గ్జాండ‌ర్ కేజ్ అనే చిత్రంతో హాలీవుడ్ లోకి ఎంట‌ర్ కాగా, ప్రియాంక బేవాచ్ అనే చిత్రం చేసింది. నిజానికి ఇద్దరి సినిమాలూ పెద్ద మార్కెట్ ఏమీ చేయలేదు, అటు దీపికా త్రిపులెక్స్ బాక్సులు సర్దేయగా, ప్రియాంకా బేవాచ్ కూడా కష్టాలని ఈదలేక చతికిల పడింది. అయితే ఈ సినిమా ఇండియాలో విడుదలయ్యాక పూర్తి విషయం తేలిపోనుంది. అయితే వీరిద్దరి పనీ ఇక హాలీవుడ్ లో ముగిసినట్టే అంటూ వచ్చిన వార్తల్లో మాత్రం ఏ నిజమూలేదు.

మంచి మార్కులే పడ్డాయి

మంచి మార్కులే పడ్డాయి

ఇద్దరూ మళ్ళీ చెరో సినిమాలో బుక్ అయిపోయారు... కమర్షియల్ గా ఆడకపోయినా నటనలో మాత్రం ఇద్దరికీ మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రాలు ఇద్ద‌రికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. అయితే ఆ చిత్రాల‌లో వీరి న‌ట‌నా నైపుణ్యానికి మెచ్చిన హాలీవుడ్ ద‌ర్శ‌కులు కొంద‌రు త‌మ సినిమాల‌లోని కీలక పాత్ర‌ల‌కు సెల‌క్ట్ చేస్తున్నారు.

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎంటరైన భామ. ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ మరోసారి హాలీవుడ్‌లో హంగామా చేయబోతోంది. ఈ సిరీస్‌లో నాలుగో చిత్రం ‘ట్రిపుల్ ఎక్స్ 4'లోనూ నటించనుంది.

సెరెనా ఉంగర్ అలియాస్ దీపికా

సెరెనా ఉంగర్ అలియాస్ దీపికా

ఈ మేరకు చిత్ర దర్శకుడు డి.జె. కరుసో దీపికా పాత్రను ఖరారు చేశారు. ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కరుసో.. కొత్త సినిమా షెడ్యూల్‌పై వచ్చేవారం సమావేశం అవుతున్నట్లు చెప్పారు. ‘సెరెనా ఉంగర్ అలియాస్ దీపికా XXX4లో ఉన్నారా?' అని ఓ అభిమాని కరుసోను ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.

ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్

ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్

దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘అవును' అని బదులిచ్చారు. కాగా, దీపికా తొలిసారిగా హాలీవుడ్‌లో నటించిన ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' బాక్సాఫీసు వద్ద ఓ మోస్తరుగా కాసుల వర్షం కురిపించింది. హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీజిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 346 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

ప్రియాకా చోప్రా

ప్రియాకా చోప్రా

హాలీవుడ్ లో క్వాంటికో అనే సీరియల్ తో పాటు బేవాచ్ అనే చిత్రం చేసింది ప్రియాకా చోప్రా. ఈ చిత్రం వచ్చే నెల 2న మన దేశంలో విడుదల కానుండగా, ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రియాకకి మరో హాలీవుడ్ ఆఫర్ వచ్చిందనేది తాజా సమాచారం.

ఎ కిడ్‌ లైక్‌ జేక్‌

ఎ కిడ్‌ లైక్‌ జేక్‌

‘ట్రాన్స్‌పరెంట్‌' సిరీస్‌ చిత్రాల దర్శకుడు సిలాస్‌ హోవర్డ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌' సీక్వెల్ చిత్రంలో ప్రియాంక నటించనుందనే విషయాన్ని చిత్ర నిర్మాత పాల్‌ బెర్నాన్‌ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ చిత్రంలో ‘ది బిగ్‌ థియరీ' నటుడు జిమ్‌ పారిసన్‌, క్లారీ డేన్స్‌, ఒక్టావియా స్పెన్సర్‌ లాంటి ప్రముఖ హలీవుడ్‌ నటులతో కలిసి ప్రియాంక నటించనుంది.

జిమ్‌ పారిసన్‌

జిమ్‌ పారిసన్‌

ఈ చిత్రంలో ‘ది బిగ్‌ థియరీ' నటుడు జిమ్‌ పారిసన్‌, క్లారీ డేన్స్‌, ఒక్టావియా స్పెన్సర్‌ లాంటి ప్రముఖ హలీవుడ్‌ నటులతో కలిసి ప్రియాంక నటించనుంది. తమ నాలుగేళ్ల కుర్రాడు జేక్‌కు అన్నీ గొప్పగా సమకూర్చాలనుకుంటారు గ్రెగ్‌, అలెక్స్‌ దంపతులు. ఓ ప్రముఖ ప్రైవేట్‌ స్కూల్‌లో జేక్‌కు సీటు కోసం ప్రయత్నిస్తారు.

 గ్రెగ్‌ స్నేహితురాలు అమల్‌ గా

గ్రెగ్‌ స్నేహితురాలు అమల్‌ గా

కానీ ఫీజు భారీగా ఉండటంతో ఆగిపోతారు. ఆ తర్వాత వాళ్లు ఏం చేశారు? అనేది అసలు కథ. ఈ చిత్రంలో గ్రెగ్‌గా జిమ్‌ పారిసన్‌, అలెక్స్‌గా క్లారీ డేన్స్‌ నటిస్తున్నారు. గ్రెగ్‌ స్నేహితురాలు అమల్‌గా ప్రియాంక నటించనుంది. మొత్తానికి ఈ ఆఫర్లతో హాలీవుడ్ లో తమ స్థానాన్ని పక్కా చేసుకునేటట్టే ఉన్నారిద్దరూ..

English summary
Deepika Padukone to star in 'xXx4', confirms DJ Caruso and Priyanka chopra already in talks to join actors Jim Parsons and Claire Danes in an upcoming drama A Kid Like Jake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu