»   » సల్మాన్ తో మళ్లీ మళ్లీ నో అంటున్న దీపిక :కారణమేంటి..?

సల్మాన్ తో మళ్లీ మళ్లీ నో అంటున్న దీపిక :కారణమేంటి..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ సూపర్ హీరొ సల్మాన్ సినిమాలొ అవకాశం అంటే సాధరణంగా ఏ హీరోయిన అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ దీపికా పడుకోనె మాత్రం సల్మాన్‌తో ఏ అవకాశమొచ్చినా నో అనేస్తోంది. సల్మాన్‌ఖాన్, దీపికల జంటను వెండితెరపై చూడాలని ఈ ఇద్దరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్‌ దర్శకులు కూడా ఆ దిశగా చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ మధ్య సల్మాన్ సినిమా "సుల్తాన్" కోసం అలీ అబ్బాస్‌ జాఫర్‌.... దీపికను సంప్రదించగా అప్పుడు డేట్స్‌ ఖాళీ లేవంటూ ఆ ఛాన్స్ మిస్‌ అయింది ఈ కన్నడ సుందరి. తర్వాత ఆ అవకాశాన్ని కాస్తా అనుష్కశర్మ సొంతం చేసుకుంది.

Deepika Padukone rejected Salman Khan again... Why..?

తాజాగా కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మానఖాన్ హీరోగా రూపొందనున్న సినిమా (ట్యూబ్‌లైట్‌... వర్కింగ్‌ టైటిల్‌) కోసం మళ్లీ దీపికనే హీరోయిన్‌గా సంప్రదించారట. మఈ సారి కూడా దీపిక నో అందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇలా ప్రతీసారీ ఏదొ ఒక కారణం తో సల్మాన్ కి దూరం గానే ఉంటోంది దీపిక.

అయితే కబీర్‌ఖాన్ చెప్పిన కథలో కథానాయిక పాత్రకు చక్కని ప్రాధాన్యం ఉందట. కానీ మన పొడుగు కాళ్ళ సుందరి దీపిక మాత్రం తాను చేయబోయే క్యారెక్టర్‌లో చిన్న మార్పు కోరిందనీ, అందుకు కబీర్‌ అంగీకరించకపోవడంతో దీపిక ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని అంటున్నారు ఆమె సన్నిహితులు.

English summary
Why Deepika Padukone is rejecting every movie offer when Salman’s name is associated with it....
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu