»   » ఒళ్లు గగుర్బొడిచే సీన్లు: హాలీవుడ్లో దీపిక అదరగొడుతోంది (న్యూ ట్రైలర్)

ఒళ్లు గగుర్బొడిచే సీన్లు: హాలీవుడ్లో దీపిక అదరగొడుతోంది (న్యూ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ 'xXx-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌' ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్ రిలీజైంది.

ఒళ్లు గగుర్బొడిచే భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజిలో అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ ట్రైలర్లో దీపిక పదుకోన్ ను చూసి ఇండియన్ ప్రేక్షకలు ఆశ్చర్యపోతున్నారు. మన బాలీవుడ్ సినిమాల్లో ఇప్పటి వరకు చూసిన దీపిక పదుకోన్... ఈవిడేనా? అని అయోమయానికి గురయ్యే రేంజిలో యాక్షన్ సీన్లు అదరగొడుతోంది ఈ హాట్ బ్యూటీ.

ట్రైలర్ అదిరింది

ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీపిక ఎఫెక్టుతో ఇండియాలోనూ ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

ఇప్పటివరకు దీపిక బాలీవుడ్‌లో చేసిన సినిమాలు ఓ ఎత్తైతే ఈ చిత్రం మరో ఎత్తు. సెరీనా ఉంజర్‌ పాత్రలో దీపిక పదుకోన్ కనిపించబోతోంది. సినిమాలోని పలు సన్నివేశాల్లో హీరో విన్‌ డీజిల్‌తో పోటీ పడుతూ దీపిక పదుకోన్ నటించింది.

హాట్ సీన్లు

హాట్ సీన్లు

దీపికకు ఇదే తొలి హాలీవుడ్ మూవీ. ఈ సినిమా ద్వారా హాలీవుడ్లో పాగావేయాలని, మరిన్ని హాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవాలని నిర్ణయించుకున్న దీపిక.... హాలీవుడ్ స్థాయిలో రొమాంటిక్ సీన్లు పండించేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర హీరో విన్ డీసెల్ తో కలిసి హాటెక్కించేలా ఇంటిమేట్ సీన్లలో నటిస్తోంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

డీజే కరుసో తెరకెక్కించిన ఈ చిత్రం 2017 జనవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో దీపిక-విన్ డీజిల్ తో పాటు టోనీ జా.. శామ్యూల్ జాక్సన్.. టోనీ కొలెట్.. నినా డొబ్రెవ్.. రూబీ రోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Watch Deepika Padukone in the explosive trailer for xXx: Return of Xander Cage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu