»   » హగ్ ఇచ్చిన ఫొటో ..ఫేస్ బుక్ లో పెట్టింది కాబట్టే

హగ్ ఇచ్చిన ఫొటో ..ఫేస్ బుక్ లో పెట్టింది కాబట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : రీసెంట్ గా రిలీజైన తమాషా చిత్రంలో చేసిన హీరోయిన్ దీపికా హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసినట్లే అంటున్నారు బాలీవుడ్ జనం. ఆమె హాలీవుడ్ సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ కు కారణం .. విన్ డీజిల్‌కు హగ్ ఇస్తూ దిగిన ఫోటోను దీపికా తన ఫేస్‌బుక్ అకౌంట్లో తాజాగా పోస్టు చేయటమే.

Deepika Padukone spotted with 'Furious 7' star Vin Diesel

దీంతో దీపిక ...హాలీవుడ్ ట్రయల్స్ చేస్తున్నట్లు ఊహాగానాలు ..నిజమే అని తేలుస్తున్నారు. దీపిక పోస్టు చేసిన ఫోటో వెనకాల త్రిబులెక్స్ పోస్టర్ ఉండడం కూడా ఆ అనుమానాలను మరింత బలపరుస్తోంది. విన్ డీజిల్ కూడా త్రిబులెక్స్ రిటర్న్స్‌కు రెఢీ అవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిల్మీ ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్‌గా మారింది.

Deepika Padukone spotted with 'Furious 7' star Vin Diesel

ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో విన్ డీజిల్ తన త్రిబులెక్స్ రిటర్న్స్ ప్రాజెక్టు గురించి వివరించాడు. మెలిసా మెకార్తి డైరక్షన్‌లో రానున్న ఆ సీక్వెల్ సినిమాకు త్రిబులెక్స్- గ్జాండర్ కేజ్ రిటర్న్స్ అని పేరు పెట్టారు. 2002లో రిలీజైన త్రిబులెక్స్ సినిమాలో గ్జాండర్ కేజ్ పాత్రలో విన్ డీజిల్ హాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేశారు.

English summary
Deepika Padukone's was recently spotted with with Hollywood actor Vin Diesel and has sparked the rumored that the two might be collaborating soon.
Please Wait while comments are loading...