»   » పవన్ కళ్యాణ్ సరసన దీపికా పడ్కోని

పవన్ కళ్యాణ్ సరసన దీపికా పడ్కోని

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రంకి హీరోయిన్ గా దీపికా పడ్కోనిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జయంత్ పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేయనున్న చిత్రం కోసం దీపికాని సంప్రదిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక గణేష్ నిర్మాతగా పవన్ హీరోగా చేసే ఈ చిత్రం లవ్ ఆజ్ కల్ కి రీమేక్. ఈ నెల 29న హైదరాబాద్ లోని హెచ్ ఐ సిసీ లో ఈ చిత్రం ప్రారంభం లాంచనంగా జరగనుంది. ఇక ఈ చిత్రంతో బాలయ్యతో జయంత్ చేస్తాడని వినిపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ప్రక్కకు వెళ్ళినట్లేనని అంటున్నారు. ఇక జయంత్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఫోర్ ఎవర్ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అందులో దీపికా పడ్కోని ఓ ఐటం సాంగ్ చేసింది. ఇక జయంత్ గతంలో వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బాలకృష్ణతో అల్లరి పిడుగు, లక్ష్మీ నరసింహా, చిరంజీవితో బావగారూ బావున్నారా చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే.అలాగే గణేష్ నిర్మాతగా రవితేజ హీరోగా ఇంతకుముందు ఆంజనేయులు చిత్రం రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu