»   » సమంత కోపంతో ఇలా క్లాసు పీకేసింది

సమంత కోపంతో ఇలా క్లాసు పీకేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ కూల్ గా ఉండే సమంత హఠాత్తుగా ఓ ఇంగ్లీష్ డైలీపై ఫైర్ అయ్యింది. దానికి కారణం ఆమె అల్లుడు శ్రీను ఆడియో పంక్షన్ కి వేసుకొచ్చిన డ్రస్ ..గతంలో దీపికపదుకోని వేసుకున్నదే అని వారు రాయటం. దాంతో ఆమె ట్విట్టర్ లో ఓ రేంజిలో ఫైర్ అయ్యింది. బాలీవుడ్ సెలబ్రేటీల స్టైల్స్ ని కాపీ కొట్టలేదని,వ్యంగ్య బాణాలు విసిరింది. తను ఇండియాలో ఉన్న ఫేమస్ డిజైనర్స్ నుంచి ఉన్న స్టైల్స్ ని వాడుకుంటున్నానని తెలిపింది.

ఆ పేపరుని ఉద్దేశిస్తూ...సమంత ట్వీట్ లు ఇలా సాగాయి... "మీ ఆఫీసులోని వారికి ఫ్యాషన్స్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ తో ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను... ఎప్పుడైతే ఒక డిజైనర్ ఒక కలెక్షన్ తో వస్తారో అప్పుడే వాళ్ళ దగ్గర ఆ సీజన్ కి సరిపోయేలా ఒకే డిజైన్ వేరు వేరు కలర్స్ లో ఉంటాయి. అంతర్జాతీయం కాకుండా జాతీయ గుర్తింపు ఉన్న లేబుల్స్ అయితే.. వాటిలో ఎప్పుడు సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే. అనామిక ఖన్నా ధోతీ స్టైల్, అర్పిత కట్ వర్క్ బ్లౌస్ స్టైల్. ఇవన్నీ ఒక్క సెలబ్రిటీ కోసం ఒక్క పీస్ మాత్రమే తయారు చెయ్యరు. అవే మోడల్స్ షాప్స్ మరియు ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి. "

Deeply hurt Samanta fires on English daily

స్టైలింగ్ లో ఒకే రకంగా అనిపించే అవుట్ ఫిట్ వేసుకోవచ్చు లేదా ఒకేరకమైన అవుట్ ఫిట్ కూడా వేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి వారి వారి స్టైల్ ఉంటుంది. నేను వండర్ఫుల్ డిజైనర్స్ చూపించిన వాటిలో నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకునేలా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే స్టైల్ కోసం మరింత కష్టపడతాను, అలాగే కాస్త ఫన్ ఉండేలా చూసుకుంటాను. నేషనల్ లెవల్లో ఫ్యాషన్ బ్లాగ్స్ మరియు వెబ్ సైట్స్ అయిన హైహీల్స్, పింక్ విల్లా, మిస్ మాలిని లాంటి వాటి పని ఫాషన్ జీనియస్ ఎవరు? ఫ్యాషన్ డిజాస్టర్ ఎవరు?అని చూడడమే. అలాంటి వారే చాలా సార్లు నా స్టైల్స్ ని పొగిడారు అన్నారామె.

English summary
Deeply hurt Samantha took to her Twitter handle and slammed TOI for coming up with such story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu